గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Feb 12, 2020 , 00:33:10

మహిళపై గుర్తు తెలియని వ్యక్తుల లైంగికదాడి

మహిళపై గుర్తు తెలియని వ్యక్తుల లైంగికదాడి
  • సూర్యాపేటకు చెందిన మహిళగా గుర్తింపు
  • బీదర్‌-హైదరాబాద్‌కు వెళ్తుండగా ఘటన

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: కర్ణాటకలోని బీదర్‌ నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌ వెళ్తున్న మహిళ (32)పై గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని బెదిరించి లైంగికదాడికి పాల్పడిన ఘటన జహీరాబాద్‌లో చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మంగళవారం సూర్యాపేటకు చెందిన మహిళ బీదర్‌ నుంచి ఆర్టీసీ బస్సులో రెండు బ్యాగుల్లో నిషేధించిన గుట్కా ప్యాకెట్లు తీసుకుని హైదరాబాద్‌కు వెళ్తున్నది. బీదర్‌ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మహిళను పోలీసులమని బెదిరించి, గుర్తింపు కార్డు చూపించి, బలవంతంగా పస్తాపూర్‌ చౌరస్తా వద్ద బస్సు నిలిపివేశారు. మహిళ వద్ద ఉన్న బ్యాగులు తీసుకుని పస్తాపూర్‌ చౌరస్తా వద్ద ఉన్న ఎస్‌బీఐ బ్యాంకు పక్కన నిలిచినట్లు చెప్పారు. మహిళ వెంట 14ఏండ్ల బాలుడు ఉన్నాడు. బాలుడు ఉండడంతో రెండు బ్యాగులు బ్యాంకు పక్కన ఉన్న హోటల్‌లో ఉంచి, మహిళను బ్యాంకు వెనుక వైపు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడారు.  దీంతో స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జహీరాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, అనుమానితుల ఫొటోలు పోలీసులు విడుదల చేశారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


logo