గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Feb 12, 2020 , 00:32:03

పాఠశాలలు తనిఖీ చేసిన రాష్ట్ర అధికారుల బృందం

పాఠశాలలు తనిఖీ చేసిన రాష్ట్ర అధికారుల బృందం

సంగారెడ్డి టౌన్‌ : పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను రాష్ట్ర అధికారుల బృందం సందర్శించారు. మంగళవారం పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలను రాష్ట్ర వయోజన విద్య, మధ్యాహ్న భోజన, గ్రంథాలయ డైరెక్టర్‌ రమణ కుమార్‌, ఆదర్శ పాఠశాలల రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌, వయోజన విద్య  జాయింట్‌ డైరెక్టర్‌ వరదాచారి, జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్‌, వయోజక విద్య డిప్యూటీ డైరెక్టర్‌ రామేశ్వర్‌ రావు, వయోజన విద్య ప్రాజెక్టు అధికారి గోవింద రావ్‌ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో డిజిటల్‌ తరగతులను పరిశీలించారు. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు, గ్రంథాలయం, మధ్యాహ్న భోజనం పరిశీలించి వంటకాలను రుచి చూశారు. పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాలలోని సైన్స్‌ ల్యాబ్‌, తరగతులను పరిశీలించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాకీర్‌ హుస్సేన్‌ విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలకు ఆరు అదనపు తరగతి గదులు, అదనపు ఉపాధ్యాయులను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర అధికారులు బృందం వెంట మండల విద్యాధికారి వెంకట నర్సింహులు, జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ వెంకటస్వామి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.  


బొల్లారం మోడల్‌ కళాశాల సందర్శన 

బొల్లారం : మున్సిపల్‌ పరిధిలోని తెలంగాణ మోడల్‌ కళాశాలను ఆదర్శ పాఠశాలల రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మోడల్‌ కళాశాల విద్యార్థుల బోధన పద్ధతులు, స్టడీ అవర్స్‌ను పర్యవేక్షించారు. ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి స్టడీ అవర్స్‌ ఏ విధంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా పరిశీలించారు.  అనంతరం ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఏఎంవో సంజీవ్‌కుమార్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ శైలజ పాల్గొన్నారు.


logo