మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Feb 11, 2020 , 23:53:03

వాటర్‌ హీటర్‌ ముట్టుకుని షాక్‌తో మహిళ మృతి

వాటర్‌ హీటర్‌ ముట్టుకుని షాక్‌తో మహిళ మృతి

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: వాటర్‌ హీటర్‌ను ముట్టుకుని షాక్‌తో మహిళ మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పట్టణంలో చోటు చేసుకున్నది. పటాన్‌చెరు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పట్టణంలో గోనెమ్మ బస్తీవాసి వడ్ల వెంకటరాజు భార్య చంద్రకళ (55) మంగళవారం నివాసంలో వేడి నీటికోసం హీటర్‌ను ప్లాస్టిక్‌ బకెట్‌ను పెట్టింది. నీరు హీట్‌ అవుతున్న సమయంలో స్విచ్‌ ఆఫ్‌ చేయకుండానే  వేడిగా ఉన్నాయా.? లేదా అని పరీక్షించింది. దీంతో విద్యుత్‌ షాక్‌ తగిలి చంద్రకళ కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు గుర్తించి తక్షణం పటాన్‌చెరు ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రకళ మృతి చెందింది. ఈ మేరకు చంద్రకళ కుమారుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


logo