మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Feb 10, 2020 , 23:14:09

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

వాంకిడి : పల్లెల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం వాంకిడి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో నవేధరి, చిచ్‌పల్లి, సావాతి, చౌపన్‌గూడ, లెండిగూడ, జంబుల్‌ధరి, ఖనర్‌గాం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆయా గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకొని, గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాల్లో వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తిచేయాలన్నారు. మౌలిక వసతులు కల్పిస్తూ, గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో నాటిన హరితహారం మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముండే విమలాబాయి, జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, వైఎస్‌ఎంపీపీ రాజ్‌కుమార్‌, సావాతి ఎంపీటీసీ కోడప మారుతి, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, చౌపన్‌గూడ సర్పంచ్‌ సీడాం అన్నిగా, సావాతి సర్పంచ్‌ దేవ్‌రావు, చిచ్‌పల్లి సర్పంచ్‌ జంగు, బంబార మాజీ ఎంపీటీసీ వినోద్‌, ఖమాన మాజీ ఎంపీటీసీ దేవినేని గొల్ల, టీఆర్‌ఎస్‌ నాయకులు పెంటు, వనపర్తి సదశివ్‌, ముండే దీపక్‌, తదితరులున్నారు.


logo