శుక్రవారం 05 జూన్ 2020
Sangareddy - Feb 10, 2020 , 23:04:10

పాలన పరుగులు పెట్టిస్తాం

పాలన పరుగులు పెట్టిస్తాం

సంగారెడ్డి ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ:పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే సర్కారు కొత్త జిల్లాలు, రెవెన్యూ కేంద్రాలు, మండలాలు, కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలన అందిస్తున్నది. కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకువచ్చిన విషయం కూడా తెలిసిందే. తాజాగా ఇప్పుడు జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును రద్దు చేశారు. ఆ స్థానంలో అదనపు కలెక్టర్‌ పోస్టులను సర్కారు సృష్టించి పోస్టులను భర్తీ కూడా చేసింది. ఇందులో భాగంగానే జిల్లాకు ఇద్దరు కొత్త అదనపు కలెక్టర్లు నియామకం అయ్యారు. ఇక్కడ జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన నిఖిల ఇటీవలే బదిలీ అయ్యారు. ఆమె పదోన్నతిపై జనగామ కలెక్టర్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. కాగా, నిఖిల స్థానం లో పంచాయతీరాజ్‌శాఖలో డిప్యూటేషన్‌పై ఎస్జీడీసీగా బాధ్యత లు నిర్వహిస్తున్న జి.వీరారెడ్డి అదనపు కలెక్టర్‌గా జిల్లాకు వ చ్చారు. కరీంనగర్‌లో స్పెషలాఫీసర్‌గా పనిచేస్తున్న రాజశ్రీ షా మరో అదనపు కలెక్టర్‌గా బదిలీపై జిల్లాకు వచ్చారు. ఇద్దరూ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాజశ్రీ షా స్థానిక సంస్థలను, వీరారెడ్డి రెవెన్యూశాఖను  పర్యవేక్షించనున్నారు. ఈ సందర్భంగా బాధ్యత లు తీసుకున్న అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ పాలనను పరుగులు పెట్టిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ మంగళవారం రాష్ట్రంలోని అన్ని కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం అదనపు కలెక్టర్ల బాధ్యతలపై మరింత స్పష్టత రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.


అదనపు కలెక్టర్ల బాధ్యతల స్వీకరణ

అదనపు కలెక్టర్లుగా వీరారెడ్డి (రెవెన్యూ), రాజశ్రీ షా (స్థానిక సంస్థల)లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ హనుమంతరావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ తరువాత కలెక్టర్‌ సమక్షంలో ఇద్దరూ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి కృషి చేస్తామని ఇద్దరు కలెక్టర్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వీరారెడ్డి గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా కేంద్రంగా సంగారెడ్డి డీఆర్వోగా పనిచేశారు. 2011 నుంచి 2013 వరకు దాదాపు 18 నెలల పాటు జిల్లాలో పనిచేశారు. కలెక్టర్‌ హనుమంతరావు సూచనలు, సలహాలతో జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాజశ్రీ షా 2017 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. కరీంనగర్‌లో స్పెషలాఫీసర్‌గా సమర్థవంతంగా పనిచేశారు. కాగా, బాధ్యత లు స్వీకరించిన ఇద్దరు అదనపు కలెక్టర్లను డీఆర్వో రాధిక రమ ణి, జడ్పీ సీఈవో టి.రవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, పశుసంవర్థకశాఖ జేడీ రామారావు రాథోడ్‌, డీఆర్డీవో శ్రీ నివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబురావు, బీసీ సంక్షేమ అధికారి కేశురాం, కార్మికశాఖ ఉపకమిషనర్‌ కోటేశ్వర్‌రావు, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి మల్లేశం, యువజన, క్రీడల సంక్షేమశాఖ అధికారి, కలెక్టరేట్‌ ఏవో గుండెరావు తదితరులు పాల్గొన్నారు.


ప్రజలకు చేరువ కానున్న పాలన

అదనపు కలెక్టర్ల నియామకంతో ప్రజలకు పాలన మరింత చేరువకానున్నది. ఇక్కడ ట్రైనీ కలెక్టర్‌గా పనిచేసిన జితేష్‌ వీ పాటిల్‌ నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. జేసీగా ఉన్న నిఖిల పదోన్నతిపై కలెక్టర్‌గా వెళ్లారు. వారిద్దరి స్థానంలో ఇద్దరు అదనపు కలెక్టర్లు జిల్లాకు వచ్చారు. ఇద్దరి నియామకంతో ఇటు రెవెన్యూలో మరోవైపు స్థానిక సంస్థల పరిధిలో ప్రజలకు మెరుగైన పాలన అందనున్నది. ఇప్పటికే పలు విభాగాల్లో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక జిల్లాకు మరింత పేరొచ్చే అవకాశమున్నది. జిల్లాలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయడంతోనే జిల్లాకు వరుస అవార్డులు, గుర్తింపులు వస్తున్నాయి. అదే స్ఫూర్తితో మరింత బాధ్యతగా పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం.

- హనుమంతరావు, కలెక్టర్‌


జిల్లాను ప్రగతి బాట పట్టిస్తాం..

జిల్లాను అన్ని రం గాల్లో ప్రగతి బాట పట్టించడానికి కృషి చేస్తా. ఇప్పటికే కలెక్టర్‌ హనుమంతరావు సారధ్యంలో జిల్లాకు పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి. కలెక్టర్‌ సూచనలు సలహాలు తీసుకుని ప్రజలకు మెరుగైన పాల న అందిస్తాం. 2017 ఐపీఎస్‌ బ్యాచ్‌లో సెలక్ట్‌ అయ్యాను. కేంద్ర ప్రభుత్వంలో అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలో కొంతకాలం పనిచేశాను. కరీంనగర్‌ స్పెలాఫీసర్‌గా మూడు నెలల పాటు విధులు నిర్వహించాను. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాను. చాలా సంతోషంగా ఉంది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి సాధించడానికి నావంతు కృషి చేస్తా. పల్లెప్రగతిలో భాగంగా నర్సరీలను అభివృద్ధి పరుస్తాం. దేశానికి పల్లెసీమలే పట్టు కొమ్మలు. ఆ పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా. జిల్లాలో 647 పంచాయతీలకు కొనసాగుతున్న ట్రాక్టర్ల పంపిణీని వేగవంతం చేస్తాం. సంగారెడ్డితో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేస్తాం. మున్సిపల్‌ కమిషనర్లతో త్వరలోనే సమీక్షలు నిర్వహిస్తాం. \

- రాజశ్రీ షా, అదనపు కలెక్టర్‌


logo