సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Feb 10, 2020 , 22:58:53

తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

సంగారెడ్డి టౌన్‌ : తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్‌ చంద్రముఖర్జీ తెలిపారు. సోమవారం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు హెచ్‌వైఎం సంస్థ ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌వో) గుర్తింపు లభించిందన్నారు. ఉన్నత విద్యా కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను అందుకున్నట్లు తెలిపారు. ఐఎస్‌వో ఆధ్వర్యంలో 92 కళాశాల్లో నిర్వహణ, అధ్యాపకుల నైపుణ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని హెచ్‌ఐఎం సంస్థ, ఇంగ్లాండ్‌కు చెందిన గ్లోబల్‌ అక్రిడేషన్‌ సంస్థల సంయుక్తం ఆధ్వర్యంలో కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు నిచ్చిందన్నారు. logo