శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Feb 09, 2020 , 23:04:40

ఆర్సీపురంలో ఘనంగా మల్లన్న జాతర

ఆర్సీపురంలో ఘనంగా మల్లన్న జాతర

రామచంద్రాపురం : డివిజన్‌లోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీలో ఉన్న భ్రమరాంబికా మల్లికార్జునస్వామి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం గంపల ఊరేగింపు అనంతరం స్వామివారి కల్యాణం నిర్వహించారు. మధ్యాహ్నం అగ్నిగుండం నిర్వహించారు. సాయంత్రం మహిళలు ఊరేగింపుగా బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. రాత్రి స్వామివారి జీవిత చరిత్రపై ఒగ్గుకథను వివరించారు. జాతరలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, కార్పొరేటర్లను సన్మానించారు. కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌, గ్రంథాలయ డైరెక్టర్‌ కుమార్‌గౌడ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుష్పానగేశ్‌, డివిజన్‌ అధ్యక్షుడు పరమేశ్‌యాదవ్‌, ఆదర్శ్‌రెడ్డి, కుమార్‌యాదవ్‌, మల్లేశ్‌, ఐలేష్‌, గోపాల్‌కృష్ణ, కృష్ణకాంత్‌, గోవింద్‌ పాల్గొన్నారు.


logo