బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Feb 09, 2020 , 23:04:05

నాదులాపూర్‌ ఆశ్రమ 34వ వార్షికోత్సవం

నాదులాపూర్‌ ఆశ్రమ 34వ వార్షికోత్సవం

అందోల్‌, నమస్తే తెలంగాణ: మండలంలోని నాదులాపూర్‌లోని సదానంద ఆశ్రమ 34వ వార్షికోత్సవానికి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పి.మంజుశ్రీ జైపాల్‌రెడ్డి ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేడుకను ఆశ్రమ నిర్వాహకులు శివానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆశ్రమంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దైవ భక్తిని కలిగి ఉండాలని, ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారన్నారు. సేవా భావాన్ని కలిగి ఉండి, ఇతరులకు నిస్వార్థగా సేవచేయాలని ఆమె సూచించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆమె వెంట డీసీబీసీ మాజీ వైస్‌ చైర్మన్‌ పి.జైపాల్‌రెడ్డి, జడ్పీటీసీ ఖాదిరాబాద్‌ రమేశ్‌, డాకూర్‌ మాజీ సర్పంచ్‌ తమ్మలి శ్రీనివాస్‌, నాయకులు సురేశ్‌ ఉన్నారు.


logo