బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Feb 08, 2020 , 22:45:14

రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం

రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
  • జాతీయ లోక్‌ అదాలత్‌లో 1839 కేసులు పరిష్కారం
  • రూ.కోటి 75 లక్షల నష్టపరిహారం చెల్లింపు

సంగారెడ్డి టౌన్‌ : రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. శనివారం జిల్లా కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1839 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కేసుల్లో రూ.1,75,77, 984లు నష్ట పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. 26 ఎంవీవోపీ కేసుల్లో రూ.1,61,76,000ల నష్టపరిహారం, 36 సివిల్‌ కేసులు, 843 క్రిమినల్‌ కేసులు, ల్యాండ్‌ అక్విజేషన్‌ కేసులో రూ.14,01,984ల నష్ట పరిహారం ఇప్పించామని తెలిపారు. అదే విధంగా 933 ప్రీ లిటిగేషన్‌ కేసులను పరిష్కరించామన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా సమయం వృథాకాదని, కోర్టుల చుట్టూ తిరుగకుండా సమయాన్ని, డబ్బును కాపాడుకోవచ్చన్నారు. ఉమ్మడి కోర్టు భవనాల్లో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో ఫస్ట్‌ అడిషనల్‌ జిల్లా జడ్జి పాపిరెడ్డి, సెకెండ్‌ క్లాస్‌ అడిషనల్‌ జిల్లా జడ్జి శ్యాంశ్రీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆశాలత, సీనియర్‌ సివిల్‌ జడ్జి పుష్పలత, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కల్పన, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, నర్సింగ్‌రావు, పీపీ శ్రీనివాస్‌, సి.విఠల్‌రెడ్డి, గౌతమి, పి.బాల్‌రెడ్డి, జె.శ్రీకాంత్‌, సాయికుమార్‌, జ్ఞానోభా, అడ్వకేట్లు, కక్షిదారులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బం ది, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.  


logo