శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Feb 08, 2020 , 22:42:18

నేడు ఐఐటీలో ఈప్లూటో బైక్‌ ఆవిష్కరణ

నేడు ఐఐటీలో ఈప్లూటో బైక్‌ ఆవిష్కరణ

కంది : ఐఐటీ హైదరాబాద్‌, ప్యూర్‌ ఈవీ ఎనర్జీ బ్యాటరీల తయారీ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ఈప్లూటో 7జీ ఎలక్ట్రిక్‌ బైక్‌ను ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా నీతి అయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వి.కె. సరస్వత్‌, డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డిలతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్‌, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బి.ఎస్‌. మూర్తిలు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగా రూపొందించిన ఈప్లూటో 7జీ బైక్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.