ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Feb 08, 2020 , T00:25

గీతం నృత్యం...

గీతం నృత్యం...

ఆట, పాటలతో గీతం ప్రమాణ-2020 హుషారుగా కొనసాగుతున్నది. శుక్రవారం గీతం విశ్వవిద్యాలయంలో రెండో రోజు సాంస్కృతిక, సాంకేతిక కార్యక్రమాలు అలరించాయి. గీతామాధురి, పృథ్వీ చంద్ర, మాళవిక ఆనంద్‌ల స్వరాలాపన విద్యార్థుల్లో జోష్ నింపింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్యన్ శర్మ డాన్స్ వర్క్‌షాప్ విద్యార్థులకు కొత్త డాన్స్‌లు పరిచయం చేశాయి. అంతకుముందు విద్యార్థుల ద్విచక్రవాహనాల ప్రదర్శన, ర్యాంప్‌వాక్, పలు సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి.

 పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ:వాహనాలపై రయ్.. రయ్ అంటూ గీతం మైదానంలో సందడి చేశారు. మార్కెల్ ఉన్న అత్యున్నత శ్రేణి భారీ ద్విచక్ర వాహనాల ప్రదర్శన అందరిలో కొత్త ఉత్సాహం నింపింది. ఆటపాటలతో గీతం ప్రమాణ-2020 హుషారుగా కొనసాగుతున్నది. శుక్రవారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం హైదరాబాద్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ప్రమాణ-2020 రెండో రోజు సాంస్కృతిక, సాంకేతిక కార్యక్రమాలు ధూంధాంగా జరిగాయి. ఎక్స్‌ప్లాయిట్ పేరున నిర్వహించిన ఆటో షోతో యువతలో ఉత్సాహం కేరింతలు కొట్టింది. లాంబార్గిని, ఆడీ-ఎస్5, ఆడీ-ఏ3, బీఎండూబ్ల్యూ, ఇసూజు, కియా వంటి అత్యాధునికమైన, ఖరీదైన కార్లు, బీఎండబ్ల్యూ, సుజూకీ ఇట్రీవర్, హర్లీ డెవిడ్సన్, సీబీజెడ్, కవాసాకీ వంటి బైక్‌లు గీతం ప్రాంగణంలో సందడి చేశాయి. వర్ధమాన సినీనటుడు విశ్వక్షేన్ గీతం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. గీతామాధురి, పృథ్వీ చంద్ర, మాళవిక ఆనంద్‌ల స్వరాలాపన గీతం విద్యార్థుల్లో జోష్ నింపింది. ర్యాంప్‌వాక్ అందరినీ ఆకట్టుకున్నది. కొత్త మోడల్స్‌లో డ్రెస్స్‌లు ధరించి విద్యార్థులు అందరినీ ఆకర్షించారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబర్స్ సందడితో రెండు రోజులు సరదాగా కొనసాగాయి. ప్రముఖ కోరియోగ్రాఫర్ ఆర్యన్ శర్మ (కిండ్స్ యునైటెడ్ ఇం డియా) డాన్స్ వర్క్‌షాప్ విద్యార్థులకు కొత్త డాన్స్‌లు పరిచయం చేశాయి. జంటనగరంతో పాటు పలు పట్టణాల నుంచి వచ్చిన దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు రెండో రోజు ప్రమాణ కార్యక్రమంలో హుషారు నింపారు. శనివారం రోజు అరోన్ చూపా, లిటిల్ సిస్ నోరా, అకేడ్‌లు నిర్వహించనున్న ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ నైట్ జరుగబోతున్నదని గీతం ప్రతినిధులు తెలిపారు. 


logo