మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Feb 08, 2020 , T00:10

విద్యార్థులు ఆటపాటల్లో ముందుండాలి

విద్యార్థులు ఆటపాటల్లో ముందుండాలి

రామచంద్రాపురం: ఆటపాటల్లో విద్యార్థులు ముందుండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో రామచంద్రాపురం విద్యాభారతి స్కూల్‌లో నిర్వహిస్తున్న ఖేల్‌ఖూద్ క్రీడాపోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌ద్వారా ఇచ్చిన గౌరవాన్ని స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఆటపాటలు హక్కు అన్నారు. తల్లిదండ్రులు కేవలం చదువుపైనే ఒత్తిడి తేస్తుండటంతో చిన్నారులు అన్ని రకాలుగా ధృడంగా ఉండటం లేదన్నారు. చదువుతో పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులు పాల్గొనేలా అందరూ ప్రోత్సహించాలన్నారు. క్రీడారంగాన్ని కేరీర్‌గా తీసుకున్నవారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు. విద్యార్థులు గంటపాటైనా ఇష్టమైన క్రీడల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు చూడాలని సూచించారు. విద్యాభారతీ స్కూల్‌లో నిర్వహిస్తున్న ఖేల్ ఖూద్ క్రీడాపోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధూఆదర్శ్‌రెడ్డి, తొంట అంజయ్యయాదవ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.logo