మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Feb 08, 2020 , T00:05

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారి పద్మావతి

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారి పద్మావతి


సంగారెడ్డి టౌన్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధికారి పద్మావతి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని టీఎన్‌జీవో భవన్‌లో మహిళా సాధికారత, అవగాహన సదస్సును విజన్ సంస్థ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ మండలి హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, అందుకు తమశాఖ ద్వారా పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. సాంఘిక సంక్షేమ మండలి రాష్ట్ర కార్యదర్శి సుగుణ మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో మహిళలు చట్టాలపై, హక్కులపైన అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై అవగాహన కలిగి ఉండేందుకు ఆ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు ఉపయోగించుకుని మహిళల చట్టాలను తెలుసుకోవాలన్నారు. సదస్సులో సీడబ్ల్యూసీ చైర్మన్ శివకుమారి, మెప్మా టీఎంసీ బస్వంత్‌రెడ్డి, మెడ్వాన్ నెట్‌వర్క్ యాదగిరి, ఐకేపీ డీపీఎం జయశ్రీ, జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, ఆరోగ్యశాఖ ఎం.సుందరి, సీడ్ డైరెక్టర్ కేశయ్య స్వామి, జిల్లా పోషణ్ అభియాన్ ఇన్‌చార్జి సౌజన్య, విజన్ డైరెక్టర్ వి.కైలాస్ తదితరులు పాల్గొన్నారు. 


logo