గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Feb 07, 2020 , T01:05

సహకార నామినేషన్ల స్వీకరణ

సహకార నామినేషన్ల స్వీకరణ

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : సహకార ఎన్నికల నా మినేష్ల పర్వంలో గురువారం తొలిరోజు నామినేషన్లు ఓ మాదిరిగానే దాఖలయ్యాయి. అయితే పటాన్‌చెరు, రుద్రారం  సొసైటీల్లో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు.  నియోజకవర్గంలో ఎనిమిది పీఏసీఎస్‌లు ఉంటే వాటిలో ఆరు సహకార సంఘాల్లో మాత్రమే నామినేషన్లు వచ్చాయి. భానూర్ పీఎస్‌సీఎస్‌లో రెండు నామినేషన్లు, తెల్లాపూర్‌లో మూడు నామినేషన్లు, గుమ్మడిదలలో ఒక నామినేషన్, ముత్తంగిలో తొమ్మిది నామినేషన్లు, వావిలాల పీఏసీఎస్‌లో ఐదు నామినేషన్లు, సోలక్‌పల్లిలో ఆరు నామినేషన్లు వేశారు. ఈ మేరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామకృష్ణ విలేకరుతో మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 8వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9న స్కూృట్నీ ఉంటుందన్నారు. 10న ఎన్నికల ఫైనల్ లిస్ట్ ఉంటుందన్నారు. 15న ఎన్నికలుంటాయని తెలిపారు.  

గుమ్మడిదల : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు ఒక నామినేషను వచ్చిందని ఎన్నికల ప్రత్యేకాధికారి వెల్లడించారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రంలో ఎన్నికల ప్రత్యేకాధికారి ఎండీ.జావీద్, సీఈవో లచ్చిరాంకు పీఏసీఎస్ 8వ వార్డు నుంచి అన్నారం గ్రామానికి చెందిన ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. గుమ్మడిదల సహకార సంఘం ఎన్నికలో 13 వార్డులు ఉండగా, 882 మంది ఓట ర్లు ఉన్నారు. ఇందులో వార్డుకు 68 ఓట్లు ఉన్నాయి. గుమ్మడిదల పరిధిలో ఒకటి నుంచి నాలుగు వార్డులకు మూడు ఎస్సీ జనరల్, ఒకటి జనరల్ మహిళకు రిజర్వేన్‌ఖరారు అ య్యాయి. కానుకుంటకు 5,6 వార్డులకు జనరల్, కానుకుంట, దాచారం, అనంతారం, అన్నారం గ్రామాలకు 7 వార్డు జనరల్, 8వ వార్డు అన్నారం జనరల్, 9వ వార్డు అన్నారం, దోమడుగు, బొంతపల్లి, మంభాపూర్ గ్రామాల వార్డుకు బీసీ జనరల్, 10 వార్డు  మంభాపూర్ నల్లవల్లి గ్రామాలకు చెందిన వార్డు ఎస్సీ మహిళ, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాలకు 11 వార్డు ఎస్సీ జనరల్, 12 వార్డు ఎస్టీ, 13 వార్డు ఓసీ జనరల్‌కు కొత్తపల్లి గ్రామానికి రిజర్వేషన్లు ఖరారు చేశారని ఎన్నికల ప్రత్యేకాధికారి వెల్లడించారు.

జిన్నారం : మండలంలోని వావిలాల, సోలక్‌పల్లి పీఏసీఎస్‌లకు మొదటి రోజు 11 నామినేషన్లు వచ్చాయి. వావిలాల పీఏసీఎస్‌కు ఐదు, సోలక్‌పల్లి పీఏసీఎస్‌కు ఆరు నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు రవీంద్రనాథ్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి గురువారం తెలిపారు. వావిలాల పీఏసీఎస్‌లో 13 వార్డులు ఉండగా 6, 8, 9, 11, 13 వార్డులకు ఒక్కో నామినేషన్ రాగా, సోలక్‌పల్లి పీఏసీఎస్‌లో 13 వార్డులు ఉండగా 1, 4, 5, 6, 9, 10 వార్డులకు ఒక్కో నామినేషన్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 


logo