మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Feb 06, 2020 , 00:26:08

ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర

ఘనంగా సమ్మక్క సారలమ్మ జాతర

అమీన్‌పూర్‌ : అమీన్‌పూర్‌లో సమ్మక్క సారలమ్మల జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోగిని శ్యామలతో బోనాల కార్యక్రమం చేపట్టారు. పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాల నడుమ అమ్మవారికి బోనాలను తీసుకెళ్లారు.  మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డి తన నివాసంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యే మహిపాల్‌రెడ్డి, ఆయన సతీమణి యాదమ్మ, ఎం పీపీ దేవానంద్‌, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, పటాన్‌చెరు జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరసింహాగౌడ్‌, కౌన్సిలర్లు కృష్ణ, కల్పన ఉపేందర్‌రెడ్డి, మహాదేవరెడ్డి, కొల్లూరు మల్లేశ్‌, బిజిలీ రాజు, నవనీత జగదీశ్‌, మంజుల ప్రమోద్‌, యూ సుఫ్‌, చంద్రకళ  గోపాల్‌, మల్లేశ్‌, నాయకులు ఆసిఫ్‌, రాముడు, దాసు యాదవ్‌, నీలం భిక్షపతి, భక్తులు పాల్గొన్నారు. 


logo