బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Feb 05, 2020 , 00:44:59

ఎమ్మెల్యే కృషి అభినందనీయం

ఎమ్మెల్యే కృషి అభినందనీయం

అందోల్‌, నమస్తే తెలంగాణ: జోగిపేట పట్టణాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయించడంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ చేసిన కృషి అభినందనీయమని మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్య అన్నారు. మంగళవారం అందోలులో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జోగిపేటలో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సంబంధిత శాఖ అధికారులను ఎప్పటికప్పుడు కలిసి, న్యాయపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఎమ్మెల్యే పట్టుదలతోనే జోగిపేట రెవెన్యూ డివిజన్‌గా సకాలంలో ఏర్పాటు సాధ్యమైందన్నారు. రెవెన్యూ డివిజన్‌గా జోగిపేట పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందోలు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కావడం సంతోషంగా ఉన్నదన్నారు. జోగిపేట ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్‌ నెరవేర్చారన్నారు. రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌, సహకరించిన మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు.  కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి,  పార్టీ  మండల మాజీఅధ్యక్షుడు పట్లూరి శివశేఖర్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డీబీ. నాగభూషణం, ఆత్మగౌరవ కమిటీ అధ్యక్షుడు డి.వీరభద్రరావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, నాయకులు పెండ్యాల రాములు, అనిల్‌రాజ్‌, శంకర్‌యాదవ్‌, నాగరాజ్‌, గణేశ్‌, తుపాకుల సునీల్‌ కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  logo