బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Feb 05, 2020 , 00:36:33

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు సర్పంచ్‌లు కృషి చేయాలని ఎంపీడీవో రాములు సూచించారు. మంగళవారం మండలంలోని శేకాపూర్‌, శేకాపూర్‌తండాలో పర్యటించి ఉపాధి హామీ పనులు, నర్సరీలు పరిశీలించారు. వై కుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు. ఇంకుడు గుంతల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పంచాయతీలో ప్రభుత్వం నర్సరీలు పెంచుతుందని, నర్సరీలో వందశాతం మొక్కలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఝరాసంగంలో..

ఝరాసంగం: వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, ఇంకుడుగుంతల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని పంచాయతీ కార్యదర్శి వీరన్న అన్నారు. మంగళవారం సిద్దాపూర్‌ డంపింగ్‌  నిర్మా ణ పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కృషి స్తామన్నారు. 


logo