సోమవారం 26 అక్టోబర్ 2020
Sangareddy - Feb 02, 2020 , 22:34:54

అభివృద్ధి పథంలో పటాన్‌చెరు నియోజకవర్గం

అభివృద్ధి పథంలో పటాన్‌చెరు నియోజకవర్గం

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ : నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్‌చెరు మండలం ఘనాపూర్‌, వేముకుంట గ్రామాల్లో సర్పంచ్‌ కావ్యకాశిరెడ్డి సర్పంచ్‌గా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ మాట్లాడుతూ.. ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుని పనులు చేయడంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముందుంటారని ఆమె అన్నారు. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేస్తున్నారని జడ్పీ నిధులను జడ్పీటీసీ సుప్రజవెంకట్‌రెడ్డి కోరికమేరకు ఇస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా ఆదర్శంగా ఉండాలనే ఆరాటంతో అన్ని మండలాలను అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేస్తున్నానని తెలిపారు. 


రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు.  రూ.కోటి 10 లక్షలకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్‌ నిర్మాణానికి శంకుస్థాపన, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన, హైమాస్ట్‌ లైట్లను ప్రారంభించారు. గ్రామాల్లో రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి పనులకు అండగా ఉండాలని కోరారు. సర్పంచ్‌ కావ్యకాశిరెడ్డి సొంత డబ్బుతో ట్రాక్టర్‌ కొనుగోలు చేశారని కొనియాడారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదన్నారు. సాక్షాత్తు మోదీ పుట్టిన గుజరాత్‌ రాష్ట్రంలోనే 24 గంటల కరెంటు ఇస్తలేరన్నారు. ఘనాపూర్‌ చౌరస్తా నుంచి రూ.2.20 కోట్లతో రోడ్డును వేస్తున్నామన్నారు. స్ట్రీట్‌ ైలెట్లను కూడా వేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ కొత్త భవనాన్ని, స్కూల్‌లో కొత్త భవనం, మహిళా సంఘాల భవనాన్ని ఆరు నెలల్లో నిర్మించి ఇస్తామని హామినిచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ కావ్యాకాశిరెడ్డి దంపతులు జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజవెంకట్‌రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ నినాచంద్రశేఖర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ వెంకటేశ్‌, ఎంపీడీవో అనంతరెడ్డి, కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, బి.వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నారాయణ, రాజు, శ్రీను, క్రిష్ణ, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo