శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Feb 01, 2020 , 23:20:56

రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకు కృషి

రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకు కృషి
  • ఉమ్మడి జిల్లాలో రూ.55 కోట్లతో వ్యాపారం
  • ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవో శ్రీనివాస్‌రావు

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : రైతుల సంక్షేమానికి సహకార కేంద్ర బ్యాంకు పని చేస్తుందని, రైతులు పంటలు సాగు చేయడంతో పాటు వ్యవసాయ అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసేందుకు రుణాలు మంజూరు చేస్తున్నామని ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వాణ అధికారి ( సీఇవో) శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం జహీరాబాద్‌ పట్టణంలో కొత్త భవనంలోని సహకార బ్యాంకును మార్పు చేసి పూజలు చేసిన అనంతరం మాట్లాడారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బ్యాంకు రూ.55 కోట్లతో వ్యాపారం చేస్తుందన్నారు. రూ.15 కోట్ల డిపాజిట్లు సేకరించి, రూ.40 కోట్ల అప్పులు ఇవ్వడం జరిగిందన్నారు. ఉమ్మడి జిల్లాలో 43 సహకార కేంద్ర బ్యాంకులు ఉండగా, కొత్తగా 6 బ్యాంకులు ప్రారంభిస్తున్నామన్నారు. రాయికోడ్‌, వట్‌పల్లి, టేక్మాల్‌ , ఘనపూర్‌, భూపాల్‌పల్లి, కూకునూర్‌పల్లిలో కొత్తగా బ్యాంకులు ప్రారంభిస్తామన్నారు. రాయికోడ్‌లో కొత్తగా సహకార బ్యాంకు ఏర్పాటు చేసి రూ.1.80 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. జహీరాబాద్‌లో కొత్త భవనంలో సహకార బ్యాంకు మార్పు చేసి, పూజలు చేసిన ఎన్నికల కోడ్‌ ఉండడంతో డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఫరీదుద్దీన్‌ రాలేదన్నారు. కార్యక్రమంలో సహకార బ్యాంకు డీజీఎం జనార్థన్‌, జహీరాబాద్‌ బ్యాంకు మేనేజర్‌ రాజుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.