బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Feb 01, 2020 , 23:15:00

ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలి

సంగారెడ్డి చౌరస్తా : సహకార ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ హనుమంతరావు పేర్కొన్నారు. సహకార ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులను నియమించిన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 53 పీఏసీలు, 689 ప్రాదేశిక వర్గాలకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఎవరు నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా చట్టంలో వచ్చిన మార్పులు, చేర్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొని అధికారులందరూ క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖాధికారి తుమ్మ ప్రసాద్‌, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్లు హలావత్‌ అంజయ్య, సిద్ధారెడ్డి, ఫీల్డ్‌ అధికారులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. 


logo