సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Jan 31, 2020 , 23:57:01

గీతం యూనివర్సిటీని

గీతం యూనివర్సిటీని

సందర్శించిన జర్మనీ ప్రతినిధులు

పటాన్‌చెరు, నమస్తే తెలంగాణ: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయాన్ని జర్మనీ దేశ ప్రతినిధులు సందర్శించారు. శుక్రవారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయాన్ని జర్మనీ నుంచి వచ్చిన సమాజ సాధికారణ గ్రామీణ సంస్థ (రోజ్‌) ప్రతినిధులు రాబర్ట్‌ ఫెల్లెనెర్‌, ఇవా ఫెల్లెనెర్‌, ఛార్లెట్టీలతో పాటు భారతీయ ప్రతినిధులు రోజ్‌ సంస్థ అధ్యక్షుడు వి.శేషయ్య, ఉపాధ్యక్షుడు వైవీ రావు, డాక్టర్‌ ఈవీ నర్సింహారావులు పరిశీలించారు. ఈ బృందం తెలంగాణలోని పలు పాఠశాలల్లో బాలికల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నది. బాలికల విద్య, ఆరోగ్యం విషయంలో రోజ్‌ ఫౌండేషన్‌ ఆర్థికంగా అండగా నిలుస్తున్నది. ఈ బృందం గీతం యూనివర్సిటీలోని హాస్టల్‌, గ్రంథాలయం, నైపుణ్యాభివృద్ది కేంద్రం, నవకల్పనా కేంద్రాలతో పాటు శివాజీ ఆడిటోరియాన్ని సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రోజ్‌ ఫౌండేషన్‌ జర్మనీ ప్రతినిధులు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాలికలు ఎదర్కొంటున్న అనేక సమస్యలను తాము పరిశీలిస్తున్నట్లు చెప్పారు.


 కౌమార దశలోని బాలికలు ఆరోగ్యకరం గాను ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇండియాలో పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి బాలికల చైతన్యానికి తాము పాటుపడుతున్నామని చెప్పారు. చదువుతోనే బాలికలు తమను తాము కాపాడుకోవచ్చని తెలిపారు. గీతం విద్యాసంస్థలో విద్యార్థినులకు మెరుగైన వసతులున్నాయని తెలిపారు. చక్కటి వసతులున్న చోటనే యువతులు సంపూర్ణంగా ఎదుగుతారన్నారు. ఆరోగ్యం, విద్య రెండింటిలోనూ కౌమార బాలికలు ఇంకా చైతన్యవంతులు కావా ల్సి ఉందన్నారు. కార్యక్రమంలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎస్‌. ఫణికుమార్‌, జాతీయ సేవా పథకం సమన్వయ కర్త డాక్టర్‌ పీవీ నాగేంద్రకుమార్‌ ఈ బృందాన్ని స్వాగతించగా, బీటెక్‌ చివరి ఏడాది విద్యార్థులు లోహిత్‌, నీరజ్‌, మానస, కృష్ణకుమారీలు జర్మనీ బృందానికి క్యాంపస్‌ను చూపించారు.


logo