సోమవారం 19 అక్టోబర్ 2020
Sangareddy - Jan 30, 2020 , 23:48:33

సహకార సమరం

సహకార సమరం
  • ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
  • ఫిబ్రవరి 3న అన్ని సొసైటీల్లో నోటిఫికేషన్‌
  • 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ
  • 10న ఉపసంహరణ, అదేరోజు తుదిజాబితా
  • 15న పోలింగ్‌, వెంటనే లెక్కింపు, ఫలితాలు
  • జిల్లాలో 53 ప్రాథమిక సహకార సంఘాలు
  • మొదలైన సహకార ఎన్నికల కోలాహలం

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌  షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన మరుసటి రోజే  విడుదల కావడం గమనా ర్హం.   ఫిబ్రవరి 3వ తేదీన జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.  6 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉం టుంది. 15న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. 16న ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. జిల్లాలోని 26 మండలాల పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌, అందోలు ఐదు సబ్‌డివిజన్లలో మొత్తం 53 ప్రాథమిక వ్యవసాయ సహకార  సంఘాలు ఉన్నాయి. 50,609 మంది ఓటర్లు ఉన్నారు. వీటితో పాటు అధికారులు మరో 13 సంఘాలను కొత్తగా గుర్తించారు. అయితే పాత సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా సహకార అధికారి ప్రసాద్‌ వెల్లడించారు.


ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన మరుసటి రోజే నోటిఫికేషన్‌ విడుదల కావడం గమనా ర్హం. కాగా, ఫిబ్రవరి 3వ తేదీన జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.  6 నుంచి 8 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 9న నామినేషన్ల పరిశీలన, 10న నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ఉం టుంది. 15న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. 16న ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. జిల్లాలోని 26 మండలాల పరిధిలోని సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌, అందోలు ఐదు సబ్‌డివిజన్లలో మొత్తం 53 ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాలు ఉన్నాయి. 50,609 మంది ఓటర్లు ఉన్నారు. వీటితో పాటు అధికారులు మరో 13 సంఘాలను కొత్తగా గుర్తించారు. అయితే పాత సంఘాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా సహకార అధికారి ప్రసాద్‌ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో వెల్లడించారు. 


2013 జనవరిలో ఎన్నికలు..

ఉమ్మడి మెదక్‌ జిల్లా ఉండగా, 2013 జనవరిలో ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరిలో గెలిచిన సభ్యులు బాధ్యతలు తీసుకున్నారు. 2018 నాటికే ఈ సంఘాల పదవీ కాలం ముగిసింది. అయితే అప్పటి నుంచి ప్రతి 6 నెలల కాల పరిమితిని పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పీఏసీఎస్‌ ఎన్నికల వాయిదా అనివార్యమైంది. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అన్నిరకాల ఎన్నికలు ముగిసిన క్రమంలో పీఏసీఎస్‌ ఎన్నికలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు, మూడు రోజులుగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 53 సంఘాలు ఉన్నాయి. అత్యధికంగా  జహీరాబాద్‌ డివిజన్‌లో 14 సంఘాలు ఉండగా, 16,076 మంది ఓటర్లు ఉన్నారు. ఖేడ్‌లో 12 సంఘాల్లో 12,306 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా పటాన్‌చెరు డివిజన్‌లోని 8 సంఘాల్లో 4689 మంది ఓటర్లు ఉన్నారు.


కంగ్టి పీఏఎసీఎస్‌లో ఎక్కువ ఓటర్లు...

జిల్లాలో మొత్తం 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వీటిలో  కంగ్టి సంఘంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 2,226 మంది ఓటర్లు ఉండగా,   ఖేడ్‌ పీఏసీఎస్‌లో 2149 మంది, ఝరాసంఘంలో 2134, మల్‌చెల్మలో 2034, సదాశివపేటలో 1874 మంది, ఖాదిరాబాద్‌లో 1799, ఇప్పపల్లిలో 1766, పెద్ద చెల్మెడలో 1750 మంది ఓటర్లు ఉన్నారు. తక్కువగా నందికందిలో 277, బిలాల్‌పూర్‌లో 276, ముత్తంగి 316, బిడెకన్నెలో 341, పుల్కల్‌లో 348, నాగ్‌పూర్‌లో 351 మంది ఓటర్లు ఉన్నారు. 


13 కొత్త సంఘాలకు ఎన్నికలు లేవు..

జిల్లాలో 53 సంఘాలు ఉండగా, ఇటీవల కొత్తగా మరో 13 సంఘాలను అధికారులు గుర్తించారు. అమీన్‌పూర్‌, నాగల్‌గిద్ద మండలాల్లో రెండు సంఘాలు, గుమ్మడిదల, మొగుడంపల్లి, కంది, వట్‌పల్లి, మునిపల్లి, రామచంద్రాపురం, మనూరు, కంగ్టి, సిర్గాపూర్‌ మండలాల్లో ఒక్కో పీఏసీఎస్‌ ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. నాగల్‌గిద్ద మండలంలో నాగల్‌గిద్ద మండల కేంద్రంతో పాటు కరాస్‌గుత్తిలో, అమీన్‌ఫూర్‌ మండలంలో అమీన్‌పూర్‌ మండలం కేంద్రంతో పాటు వడక్‌పల్లి, మునిపల్లి మండల కేంద్రంలో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. కంది మండలంలో కలివేముల, గుమ్మడిదల మండలంలో నల్లవెల్లి, మొగుడుంపల్లి మండలం కేంద్రంతో పాటు కంగ్టి మండలం తడ్కల్‌, వట్‌పల్లి మండలం కేంద్రం, మనూరు మండలం రాయిపల్లి, సిర్గాపూర్‌ మండలం వాసర్‌, రామచంద్రాపురం మండలం వెలిమెలలో కొత్త సంఘాలు ఏర్పా టు కానున్నాయి. అయితే ఈ సంఘాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో పాత వాటికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 


ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం.  అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశానికి వెళ్లాం. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదు. నోటిఫికేషన్‌ కూడా విడుదల అయింది. 53 పీఏసీఎస్‌లలో 50 వేల పైచీలుకు మంది వరకు ఓటర్లు ఉన్నారు. ఓటర్ల సంఖ్యలో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

- తుమ్మ ప్రసాద్‌, జిల్లా కోఆపరేటివ్‌ అధికారి
logo