శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Jan 30, 2020 , 23:41:47

ఘనంగా వసంత పంచమి

ఘనంగా వసంత పంచమి

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: జహీరాబాద్‌లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని దత్తగిరి కాలనీలో ఉన్న సరస్వతీ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పలు పాఠశాలల చిన్నారులకు వేద పండితులు అక్షరాభ్యాసం చేయించారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచి జరు గుతుందని ప్రజల నమ్మకం. 


విద్య తరగని నిధి

కోహీర్‌: తమ వద్ద ఎంత ధనం ఉన్నా రోజురోజుకూ తగ్గుతుందని విద్య మాత్రం తరగని నిధి అని బర్దీపూర్‌ ఆశ్రమ పీఠాధిపతి అవధూతగిరి మహారాజ్‌, రంజోల్‌ ఆశ్రమ పీఠాధిపతి రాచయ్యస్వామి తెలిపారు. గురువారం కోహీర్‌ పట్టణంలోని సరస్వతీ శిశుమందిరంలో వసంత పంచమిని పురస్కరించుకుని చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు సక్రమ మార్గంలో పయనించేందుకు తల్లి దండ్రులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు పాపిరెడ్డి, సిద్దన్న, జగన్నాథ్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


logo