బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jan 30, 2020 , 00:33:33

సొత్తు కోసమే.. చంపేశాడు

సొత్తు కోసమే.. చంపేశాడు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కందుకూరు మండలంలో జరిగిన వృద్ధురాలి హత్యకేసును ఆరు గంటల్లోనే రాచకొండ పోలీసులు ఛేదించారు. సొత్తు కోసం మే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బుధవారం నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. నేరేడ్‌మెట్‌ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేశ్‌ భగవత్‌ వివరా లు వెల్లడించారు. కందుకూరు మండలం, నెడ్డనూరు గ్రామానికి చెందిన బాలమణికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. పెద్ద కుమారుడు మృతిచెందగా,  పెద్ద కూతురు ఊరిలో, రెండో కుమారుడు, ఇద్దరు కూతుళ్లు సిటీలో ఉం టున్నారు. ఊరిలో బాలమణి ఒంటరిగా ఉంటుంది. 


కాగా... ఆమె ఇంటికి కొద్ది దూరంలో రుక్కంబాయి .. కుమారుడు కల్యాంకర్‌ భవన్‌జీతో కలిసి ఉంటుంది. కల్యాంకర్‌ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. బాలమణి ప్రతి రోజు రుక్కం ఇంటికి వెళ్లి వస్తుండేది. కల్యాంకర్‌తో కూడా మంచిగా మాట్లాడుతుండేది. అయితే కల్యాంకర్‌ మద్యంతోపాటు చెడు అలవా ట్లకు బానిసయ్యాడు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో బాలమణి నగలపై కన్నేసి.. ఆమెను చంపేసి.. ఆ నగలను కాజేయాలనుకున్నాడు.


కల్లు తాగించి.. హత్య

కాగా..రెండు రోజుల కిందట కల్యాంకర్‌ తల్లి పక్క ఊరిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఇదే అదనుగా భావిం చి.. రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలమణిని ఇంటికి పిలిచి.. ఇద్దరు కలిసి కల్లు తాగారు. బాలమణి కొంచం మత్తులోకి జారుకోగానే ఆమె గొంతు పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు పెనుగులాడడంతో కల్యాంకర్‌ మోకాలికి గాయమైంది. వెంటనే గట్టిగా గొంతును నులమడంతో ఆమె మృతి చెందింది.  


మరుగుదొడ్డి కుండీలో చోరీ సొత్తు...

బాలమణి చనిపోయిన తర్వాత.. ఆమె ఒంటిమీద ఉన్న మూడు తులాల బంగారం గొలుసు, రెండు తులాల బం గారం గుండ్లు గొలుసు, ఇతర వెండి ఆభరణాలు తీసుకుని..ప్లాస్టిక్‌ కవర్‌లో మూట గట్టి...ఇంటి ఆవరణలో ఉ న్న మరుగుదొడ్డి కుండీలో వేసి.. దానికి కట్టిన దారాన్ని బయటికి వదిలాడు. ఆ తర్వాత  మృతదేహాన్ని ఈడ్చుకె ళ్లి..ఆమె కూతురు ఇంటి ముందు పడేశాడు. అప్పటికి సమయం అర్ధరాత్రి 12.30 గంటలు దాటింది. కొద్ది సేపు ఇంట్లో ఉండి.. ఆ తర్వాత కల్లు ప్యాకెట్లను బయట పడేసేందుకు వెళ్లి .. తెలవారుజాము 5.15 గంటలకు ఇంటికి తిరిగి వస్తుండగా.. బాలమణి మనువడు చూశాడు..


పోలీసు దృష్టిని మళ్లించేందుకు..

అయితే.. పోలీసుల దృష్టి మళ్లించేందుకు.. మృతదేహాన్ని ఆమె కూతురు ఇంటి ముందు పడేశాడు.  కూతురు, అల్లు డు, మనువడిపై దృష్టి మళ్లే లా ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. బాలమణి కూతురు, మనువడుతో పాటు ఇతరుల ను ప్రాథమికంగా అనుమానించి ప్రశ్నించారు. మరో కో ణంలో దృష్టిపెట్టగా.. కల్యాంకర్‌ ఇంటి నుంచి ఘటనా స్థలం వరకు ఏర్పడిన అచ్చులను గుర్తించారు. ఆ ఇంటికి బయటి నుంచి తాళం కనపడింది. అదే సమయంలో బా త్‌రూమ్‌లో అలికిడి వినపడింది. పోలీసులు  వెళ్లి చూడగా భవన్‌జీ ఉన్నా డు.  పోలీసులు పరిశీలిస్తుండగా.. మరుగుదొడ్డి కుండీలో నుంచి దారం కనపడింది. దాన్ని బయటకు లాగగా బంగా రం గొలుసులు, ఫోన్‌ బయటపడింది. భవన్‌జీని అదుపులోకి తీసుకుని.. ఫోన్‌, గొలుసును బాలమణి కూతురికి చూపించగా.. అవి తన తల్లివని గుర్తించారు. కల్యాంకర్‌ను విచారించగా సొత్తు కోసమే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 


సమాచారం అందిన.. 7 నిమిషాల్లోనే పోలీస్‌ సేవలు

గ్రామాల్లో ఒంటరిగా ఉండే సీనియర్‌ సిటిజన్స్‌ యోగ క్షేమాలపై గ్రామ పెద్దలు లేదా వీఆర్‌ఏలు బాధ్యత తీసుకోవాలి. వారి కుటుంబ సభ్యులు కూడా నిత్యం పర్యవేక్షించుకోవాలి. రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఫోన్‌ చేసి మాట్లాడుతుండాలి. సీనియర్‌ సిటిజన్స్‌కు ఆపద, అభద్రతా భావం కలిగినప్పుడు వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే చాలు.. పోలీసులు అందుబాటులో ఉంటారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో డయల్‌ 100 తో పాటు వాట్సాప్‌ నం.9490617111కు సమాచారం అందించాలి. సమాచారం అందిన 7 నిమిషాల్లో మా సేవలు ఉంటాయి. ఒంటరిగా ఉండే సీనియర్‌ సిటిజన్స్‌ ఎవరైనా సరే.. వారికి ప్రమాదం పొంచి ఉందని అనుమానం ఉంటే చాలు .. జస్ట్‌ ఓ ఫోన్‌ ద్వారా పోలీసు సేవలను పొందవచ్చు. 

- మహేశ్‌ భగవత్‌ , రాచకొండ సీపీ


logo