గురువారం 04 జూన్ 2020
Sangareddy - Jan 29, 2020 , 23:30:13

ఏసీబీ కలకలం

ఏసీబీ కలకలం
  • - సరిహద్దు రవాణాశాఖ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు
  • - ఏఎంవీఐ త్రివేణిబాయి వద్ద అదనంగా ఉన్న రూ.28,470 సీజ్‌
  • - ఏసీబీ అదుపులో ఏఎంవీఐ, ప్రైవేట్‌ డ్రైవర్‌

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ:  65వ జాతీయ రహదారిపై కర్ణాటక సరిహద్దులో ఉన్న రవాణాశాఖ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారుల దాడులు కలకలం సృష్టించాయి. బుధవారం సాయంత్రం జహీరాబాద్‌ మండలంలోని చెరాగ్‌పల్లి శివారులో ఉన్న రవాణాశాఖ చెక్‌పోస్టుపై  ఏసీబీ అధికారులు దాడులు చేశారు.  చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న ఏఎంవీఐ త్రివేణిబాయి తన డ్రైవర్‌ పాషా ద్వారా ప్రతి లారీ నుంచి రూ.300 నుంచి రూ.500 వసూలు చేస్తున్నారని తమ దాడుల్లో వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. ఏఎంవీఐ వద్ద కౌంటర్‌లో అదనంగా ఉన్న రూ.28,470  సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు.  డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు ఏసీబీ అధికారులు చెక్‌పోస్టులో ఉన్న రికార్డులు పరిశీలించారు.  


ఏసీబీ అదుపులో ఏఎంవీఐ, ప్రైవేటు డ్రైవరు 

65వ జాతీయ రహదారిపై కర్ణాటక సరిహద్దులో ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం సాయంత్రం జహీరాబాద్‌ మండలంలోని చెరాగ్‌పల్లి శివారులోని రవాణా శాఖ చెక్‌పోస్టు పై హైదరాబాద్‌కు చెందిన ఏసీబీ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఏసీబీ డీఎస్పీలు డాక్టర్‌ శ్రీనివాస్‌లు, ప్రతాప్‌, శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌కు చెందిన కేవల్‌ ఫిర్యాదు మేరకు చెక్‌పోస్టుపై దాడి చేశామన్నారు. చెక్‌పోస్టు వద్ద రవాణా శాఖ అధికారులు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని ప్రతి  లారీ నుంచి రూ. 300 నుంచి రూ.500 వసూలు చేస్తున్నారన్నారు. సరిహద్దు చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్న ఏఎంవీఐ త్రివేణిబాయి తన డ్రైవరు షాన్‌పాషా ద్వారా ప్రతి లారీ నుంచి రూ. 300 నుంచి రూ.500 వసూలు చేస్తుందని తమ దాడుల్లో వెలుగులోకి వచ్చిందన్నారు. ఏఎంవీఐ వద్ద కౌంటర్‌లో అదనంగా రూ.28470 ఉన్నాయన్నారు. అదనంగా ఉన్న డబ్బులు సీజ్‌ చేశామన్నారు. ఏఎంవీ, డ్రైవరును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు. ఏసీబీ అధికారులు చెక్‌పోస్టులో ఉన్న రికార్డులు పరిశీలించారు. ఈ మేరక్‌ కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo