గురువారం 04 జూన్ 2020
Sangareddy - Jan 29, 2020 , 23:28:41

మంత్రులను కలిసిన నూతన పాలకవర్గం

మంత్రులను కలిసిన నూతన పాలకవర్గం

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ : నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ పాలకవర్గం సభ్యులు బుధవారం హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి మున్సిపల్‌ చైర్మన్‌ రుబీనాబేగం నజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురామ్‌, కౌన్సిలర్లు కవిత విఠల్‌, స్వప్న అభిశేక్‌ శెట్కార్‌, మూడ సంధ్యారాణి రామకృష్ణ, అబ్దుల్‌ మజీద్‌, నూర్జాహాన్‌ అబేదా బేగంతో పాటు పట్టణ టీఆర్‌ఎస్‌ నాయకులు మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులను అభినందించడంతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా ప్రజావసరాలను తీరుస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని సూచించారు. నారాయణఖేడ్‌ పట్టణ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని వారు భరోసా ఇచ్చారు. 

 

 జూట్‌ బ్యాగుల ఆవిష్కరణ 

 ప్లాస్టిక్‌ బ్యాగులను నిషేధించాలని పిలుపునిస్తూ నారాయణఖేడ్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు విజయ్‌బుజ్జి స్వచ్ఛందంగా సొంత ఖర్చుతో తయారు చేయించిన జూట్‌ బ్యాగులను బుధవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, విజయ్‌బుజ్జితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న విజయ్‌బుజ్జిని మంత్రి అభినందించారు.  


తెల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌.. 

రామచంద్రాపురం : మంత్రి హరీశ్‌రావును బుధవారం నగరంలోని ఆయన నివాసంలో తెల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లలితసోమిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వీటు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు చైర్‌పర్సన్‌ లలితసోమిరెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీని అభివృద్ధిపర్చడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర సంపాదించుకోవాలని సూచించారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె మంత్రి హరీశ్‌రావుని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలాజీ, లచ్చిరాం, నాయకులు సోమిరెడ్డి, శ్రీధర్‌ ఉన్నారు. 


మంత్రి, ఎంపీని కలిసిన చైర్‌పర్సన్లు

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మంత్రి  నివాసానికి తరలివెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసి పార్టీకి పూర్వవైభం తెచ్చారని, కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు సాధ్యమని రుజువుచేశారని మంత్రి చైరపర్సన్‌, వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లను సన్మానించి అభినందించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి ప్రధాన పాత్ర పోషించి గెలిపించిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. సంగారెడ్డి ఎన్నికల ఇన్‌చార్జులు దేవీప్రసాద్‌, బక్కీ వెంకటయ్య, మల్కాపురం శివకుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ లత, కౌన్సిలర్లు రామప్ప, జీవీ వీణ, నాని (శ్రీకాంత్‌), జయరామ్‌ పవన్‌నాయక్‌, విష్ణువర్ధన్‌, మనీల, స్రవంతి, పద్మ, ఉమ మహేశ్వరి, సమీ, మాణెమ్మ, ఆరీఫ్‌, నాయకులు విజయేందర్‌రెడ్డి, రవి, జీవీ శ్రీనివాస్‌, అజ్జూ, లాడె మల్లేశం, ప్రదీప్‌యాదవ్‌, జలేంధర్‌రావు, విఠల్‌రెడ్డి, బత్తుల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 


logo