మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jan 29, 2020 , 02:52:00

ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ: వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డు నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మొగుడంపల్లి ఎంపీడీవో శ్రీనివాస్‌రావు సూచించారు. మంగళవారం మొగుడంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్మాణం చేస్తున్న వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు నిర్మాణం పనులను పరిశీలించారు. మార్చి వరకు వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, ఇంకుడు గుంతలు పూర్తి చేసేందుకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలన్నారు. పంచాయతీలో ట్రాక్టర్లు కొనుగోలు చేసి హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయాలన్నారు. మావేశంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


ఝరాసంగంలో..

ఝరాసంగం: రెండో విడుత పల్లె ప్రగతి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మంగళవారం జోన్నెగావ్‌, చీలపల్లి గ్రామాల్లో చేపడుతున్న వైకుంఠధామాలు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను పంచాయతీ కార్యదర్శులు కృష్ణ, నాగరాజ్‌  పరిశీలించారు. గ్రామాల్లో ఇండ్ల మధ్య ఉన్న పెంటకుప్పలు, పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను తొలిగించడం, వీధులను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టారు. వారి వెంట జోన్నెగావ్‌, చీలపల్లి టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షులు కృష్ణ, ఫారూఖ్‌పాటేల్‌ ఉన్నారు.


logo