ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jan 29, 2020 , 02:50:06

వసతుల కల్పనతోనే విద్యాభివృద్ధి

వసతుల కల్పనతోనే విద్యాభివృద్ధి

- ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ : పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన వసతులు కల్పించినప్పుడే విద్యాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పీర్లతండాలో రూ.6.5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పాఠశాల ప్రహరీని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగానే పెద్దఎత్తున రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నతస్థాయికి ఎదుగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాజేశ్‌, నాయకులు రమేశ్‌చౌహాన్‌, పార్‌శెట్టి సంగప్ప, బస్వరాజ్‌, రవి పాల్గొన్నారు. 


రైతుబీమా చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

 మండలంలోని చాప్టా(కె) గ్రామానికి చెందిన మడిగెల జగదేవి మృతి చెందగా, ఆమె పేర మంజూరైన రూ. 5లక్షల రైతుబీమా చెక్కును మంగళవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆమె కొడుకుకు అందజేశారు. రైతు కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో నాయకులు పార్‌శెట్టి సంగప్ప ఉన్నారు.logo