శుక్రవారం 29 మే 2020
Sangareddy - Jan 29, 2020 , 02:45:24

సకాలంలో పన్నులు చెల్లించాలి

సకాలంలో పన్నులు చెల్లించాలి

ఝరాసంగం : ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌, కృష్ణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంతో పాటు జోన్నెగావ్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంటి పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ ప్రతిఒక్కరూ ఇంటి పన్నులు చెల్లిస్తేనే గ్రామం అభివృద్ధిలో ముందుంటుందన్నారు. మొత్తం 2లక్షల 54వేల 685 రూపాయలు టార్గెట్‌ ఉండగా, ఇంటి పన్నులు 99 వేల 500, వ్యాపార పనులు 16 వేల 750 రూపాయలు ఉండగా, 5 వేలు వ్యాపార పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కారోబార్‌ ఇస్మాయిల్‌ ఉన్నారు.


logo