శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Jan 27, 2020 , 23:55:08

విధిగా హెల్మెట్‌ ధరించడండి

విధిగా హెల్మెట్‌ ధరించడండి

సంగారెడ్డి చౌరస్తా: ద్విచక్ర వాహన దారులు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని ఇన్‌చార్జి ఉపరవాణా కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ర్యాలీతో ప్రా రంభించారు. కలెక్టరేట్‌ ఆవరణలో జెండా ఊపి కిరణ్‌కుమార్‌ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు వెళ్లి అక్కడి నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మె ట్‌ ధరించాలని అవగాహన కలిగించేందుకు ర్యాలీని నిర్వహించమన్నారు.రెండు ప్రచార రథాలను కూడా ప్రారంభించమన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రెండు వాహనాలు రోడ్డు భద్రతపై వారం రోజుల పాటు పాటలతో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పటాన్‌చెరు ఎంవీఐ రాజ్‌మహ్మద్‌, జహీరాబాద్‌ ఎంవీఐ ఆశ్వంత్‌కుమార్‌, ఎఎంవీఐలు లావణ్య, ప్రవీణ్‌కుమార్‌, రుబీనా పర్వీన్‌ తదిపాల్గొన్నారు.


వారోత్సవాల షెడ్యూల్‌..  

వారం రోజుల పాటు జిల్లాలో నిర్వహించనున్న జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల షెడ్యూల్‌ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 28న జహీరాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ఆవరణలో లారీ, స్కూల్‌ బస్సుల డ్రైవర్లకు అవగాహన కల్పించడం, 29న సంగారెడ్డి బీటీవో కార్యాలయం వద్ద ఆటోరిక్షా ర్యాలీ, పటన్‌చెరు కార్యాలయంలో పాఠశాల బస్సు డ్రైవర్లకు అవగాహన 31న సంగారెడ్డి డీటీవో కార్యాలయంలో స్కూల్‌లు, బస్సు డ్రైవర్లకు ఉచిత వైద్య పరీక్షలు, ఫిబ్రవరి 1వ తేదీన పటాన్‌చెరులో పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన, ఫిబ్రవరి 2వ తేదీన కంకోల్‌ వద్ద 65వ జాతీయ రహదారిపై సరుకు రవాణా వాహనాలకు రెడియం, టేపులు అతికించే కార్యాక్రమం నిర్వహించనున్నారు.


logo