బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jan 27, 2020 , 23:50:53

సేంద్రియ వ్యవసాయం చేయాలి

సేంద్రియ వ్యవసాయం చేయాలి

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : పర్యావరణ సంక్షోభం మారుతున్న తరణంలో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. సోమవారం మండల కేంద్రం మొగుడంపల్లిలో డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో సంచార పాత పంటల జాతరలో దేశంలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు. అధిక రసాయన మందులు పంటలకు పిచ్చికారి చేయడంతో ఆహారం కలుషితం కావడంతో తీవ్ర నష్టం ఉందన్నారు. అధిక రసాయన ఎరువులు ఉపయోగించడంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయన్నారు. రైతులు అధికంగా రసాయన ఎరువులు పంటలకు వేయడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి నష్టం వస్తుందని చెప్పారు. పశువుల ఎరువులతో సేంద్రియ ఎరువులు తయారు చేసి ఉపయోగించుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులతో పం టలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. మొగుడంపల్లి మండలంలో సేంద్రియ ఎరువులతో పం టలు సాగు చేస్తామని, ప్రజాప్రతినిధులు, రైతులు ప్రతిజ్ఞన చేశారు. వర్షధార పంటలు సాగు చేసేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో మొగుడంపల్లి ఎంపీపీ ప్రియాంకరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, మొగుడంపల్లి సర్పంచ్‌ సుగుణమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకుడు విజయ్‌మోహన్‌రెడ్డి, వ్యవసాయ అధికారి వినోద్‌కుమార్‌, డీడీఎస్‌ డైరెక్టర్‌ పివి.సతీశ్‌, తమిళనాడు ఉమెన్స్‌ కలెక్టివ్‌ ప్రతినిధి  పొన్నుతాయి, సబల సంస్థ ప్రతినిధి సరస్వతీ, నాగాలాండ్‌ నార్త్‌ నెట్‌వర్క్‌ సంస్థ ప్రతినిధి అలోలేతో పాటు డీడీఎస్‌ మహిళలు పాల్గొన్నారు.


సంచార పాత పంటల సదస్సులో తీర్మానం చేసిన అంశాలు

మొగుడంపల్లి గ్రామంలో జరిగిన సంచార పాత పంటల జాతరలో పలు అంశాలు తీర్మానం చేశారు. రసాయన ఎరువులతో పంటలు సాగు చేయం. సేంద్రియ ఎరువులతో పంటలు సాగుచేస్తాం. ఒకే పంట వ్యవసాయ పద్ధతులు అమలు చేయం, వ్యవసాయ భూములు పది రకాల అంతరు పంటలు సాగు చేస్తాం. పది నుంచి 20 రకాల పంటలు సాగు చేసేందుకు ముందుకు వస్తాం. రసాయన ఎరువులు వినియోగం తగ్గిస్తాం. సేంద్రియ వ్యవసాయం చేస్తామని సదస్సులో ప్రతిజ్ఞన చేశారు.


logo