గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Jan 27, 2020 , 04:52:46

రెపరెపలాడిన జాతీయ జెండా

రెపరెపలాడిన జాతీయ జెండా
  • కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించిన అధికారులు

సంగారెడ్డి అర్బన్‌, నమస్తే తెలంగాణ: 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రెండు పట్టణాలు, నాలుగు మండలాల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు 71వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ముఖ్య నాయకులు జెండా ఎగురవేసి నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో మెంచు నగేశ్‌, జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి, డీసీసీబీ కేంద్ర బ్యాంకు కార్యాలయం ఆవరణలో అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి, నీటిపారుదల ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ అనంతరెడ్డి, ఈఈ మధుసూధన్‌రెడ్డి ఆయా కార్యాలయాల్లో మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలో డీఎస్పీ, దుర్గాభాయ్‌శిశు మహిళా వికాస కేంద్రంలో మేనేజర్‌, విద్యుత్‌ కార్యాలయంలో ఎస్‌ఈ రవికుమార్‌, విద్యుత్‌ విజిలెన్స్‌ కార్యాలయంలో డీఎస్పీ, భూసార పరీక్ష కేంద్రంలో ఏడీ, ఎక్సైజ్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ చంద్రయ్యగౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో చైర్మన్‌ నరహరిరెడ్డి, కార్యదర్శి వసుంధర, సీడీసీ కార్యాలయంలో సహాయ కమిషనర్‌ రవీందర్‌రావు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో జీఎం, మైనార్టీ బాలురుల గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్‌, మండల వ్యవసాయ కార్యాలయంలో ఏవో ప్రసాద్‌, జిల్లా ఉపాధి కల్పన శాఖ కార్యాలయంలో జిల్లా అధికారి, జిల్లా మహిళా సమాఖ్యలో ఏపీఎం వెంకట్‌, ఎస్‌బీఐఆర్‌ఎస్‌ఈటీఐలో డైరెక్టర్‌ కేవీ రాంరెడ్డి, తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ స్వామి, ఎంపీడీవో కార్యాలయంలో ఇన్‌చార్జి అధికారి మధుసూదన్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో అధికారి నరేందర్‌ జాతీయ  జెండాను ఎగురవేశారు.  


క్రమ శిక్షణతో విద్యావంతులు కావాలి

సంగారెడ్డి చౌరస్తా: విద్యార్థులు క్రమ శిక్షణతో కూడిన విద్యావంతులు కావాలని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రముఖర్జీ పిలుపునిచ్చారు. 71వ గణతంత్ర వేడుకలను కళాశాల ఆవరణలో వైభవంగా నిర్వహించారు. జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రిన్సిపాల్‌ అనంతరం ఎన్‌సీసీ కేడేట్ల గౌరవ వందనం స్వీకరించారు.


సంగారెడ్డి మున్సిపాలిటీలో..

సంగారెడ్డి మున్సిపాలిటీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం  మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.  


కొండాపూర్‌లో..

కొండాపూర్‌: మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గణతంత్ర దినోత్సవాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. 

కందిలో..

కంది: గణతంత్ర  వేడుకలు కంది మండలంలో ఘనంగా జరిగాయి. ఆదివారం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ సరళ, ఎంపీడీవో జయలక్ష్మీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. తాసిల్దార్‌ కార్యాలయంలో రమాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు.  

సదాశివపేట: పేటలో మూడు రంగుల జాతీయ జెండా రెపరెపలాడింది. ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. 


సంగారెడ్డి రూరల్‌లో...

సంగారెడ్డి రూరల్‌: గణతంత్ర  వేడుకలు ఆదివారం  మండలంలోని ఆయా గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు. వివిధ పాఠశాలల్లో, కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి గీతాలాపన చేశారు. 

తాజావార్తలు


logo