మంగళవారం 04 ఆగస్టు 2020
Sangareddy - Jan 27, 2020 , 04:49:42

టీఆర్‌ఎస్‌ నాయకుడికి గాయాలు

టీఆర్‌ఎస్‌ నాయకుడికి గాయాలు

వట్‌పల్లి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జాతీయ జెం డాను ఎగురవేసేందుకు సరిచేస్తుండంగా విద్యుత్‌ షాక్‌ తగులడంతో టీఆర్‌ఎస్‌ నాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అతడిని వెంటనే దవాఖానకు తరలించడంతో ప్రమా దం తప్పింది. మండలంలోని ఖాదీరాబాద్‌కు చెందిన గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నర్సింహులు పంచాయతీ ఆవరణలో జెండాను ఎగురవేస్తుండగా పైనున్న విద్యుత్‌ తీగలు జెండాకు తగులడంతో విద్యుత్‌ షాక్‌ తగిలి కింద పడిపోయాడు. ప్రస్తుతం నర్సింహులు ఆరోగ్యం బాగానే ఉందని గ్రామస్తులు తెలిపారు. నర్సింహులు గాయ పడిన విషయం తెలుసుకున్న పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌, పలువురు నాయకులు దవాఖానకు వెళ్లి నర్సింహులును పరామర్శించారు.


logo