శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Jan 27, 2020 , 04:48:26

కౌన్సిలర్లకు సన్మానం

 కౌన్సిలర్లకు సన్మానం


అందోల్‌, నమస్తే తెలంగాణ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో విజయాన్ని సాధించిన అభ్యర్థులను ఆయా కులస్తులు ఘనంగా సన్మానించారు. ఆదివారం జోగిపేటలోని ముదిరాజ్‌ సంఘం భవనంలో 17వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన ఎ.చిట్టిబాబును ముదిరాజ్‌ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. శ్రీ వాసవి కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 13వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన రంగ సురేశ్‌ను ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలను కప్పి, పూలమాలలు వేసి సత్కరించారు.


logo