శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jan 24, 2020 , 23:24:32

కేతకీ వనంలో భక్తుల కోలాహలం

కేతకీ వనంలో భక్తుల కోలాహలం


ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం పుష్య బహుళ అమావాస్యను పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం శివ నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి యజ్ఞ మండపంలో పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలకు కుంకుమార్చన, రుద్రాభిషేకం, పాలాభిషేకం, అన్నపూజ తదితర పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తోర్నాల్‌ గ్రామానికి చెందిన మారుతి భక్తులకు అన్నదానం చేశారు.