మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jan 24, 2020 , 04:51:38

పట్నంలో మహిళా చైతన్యం

పట్నంలో మహిళా చైతన్యం
  • -ఓటింగ్‌లో అతివలదే పైచేయి
  • -జిల్లాలో 73.20 శాతం మహిళా ఓటింగ్‌ నమోదు
  • -72.91 పురుషుల ఓటింగ్‌ శాతం
  • -ఓటింగ్‌పై మహిళల్లో పెరుగుతున్న చైతన్యం
  • -ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న మహిళలు
  • -మొత్తం మహిళలు 1,09,876, ఓటేసిన మహిళలు 80,432 మంది


మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళల చైతన్యం వెల్లివిరిసింది. ఈసారి మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం చేపపట్టిన వివిధ రకాల అవగాహన కార్యక్రమాలతో ఓటు హక్కుపై మహిళల్లో చైతన్యం పెరిగింది. ఇటీవల కాలంలో పురుషులకంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. జిల్లాల్లో ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించగా, 73.20 శాతం మహిళా ఓటింగ్‌, 72.91 పురుషుల ఓటింగ్‌ నమోదైంది. ఏడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,09,876 మంది మహిళా ఓటర్లుండగా, 80,432 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా బొల్లారం మున్సిపాలిటీలో పురుషుల ఓటింగ్‌ 62.59 శాతం, మహిళల ఓటింగ్‌ 68.63 శాతం నమోదు కావడం గమనార్హం. కాగా, హైదరాబాద్‌కు అతి సమీపంలోని తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారంలో మహిళా ఓటింగ్‌ ఎక్కువగా నమోదైంది.
-సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి

సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఓటు హక్కు వినియోగించుకోవడంలో మహిళల్లో చైతన్యం పెరుగుతున్నది. ఎన్నికల సంఘం చేపడుతున్న వివిధ రకాల అవగాహన కార్యక్రమాలతో మహిళల్లో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతంలోకి వెళ్తే ఓటు వేయడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఇటీవల కాలంలో పురుషులకంటే మహిళలే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. జిల్లాలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఇది నిరూపితమైంది. ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు పోలింగ్‌ నిర్వహించగా, 73.20 శాతం మహిళా ఓటింగ్‌, 72.91 పురుషుల ఓటింగ్‌ నమోదైంది. వృద్ధులు, గృహిణులు, యువతులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,09,876 మంది మహిళా ఓటర్లుండగా, 80,432 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా బొల్లారం మున్సిపాలిటీలో పురుషుల ఓటింగ్‌ 62.59 శాతం, మహిళల ఓటింగ్‌ 68.63 శాతం నమో దు కావడం గమనార్హం. ఓటింగ్‌పై మహిళల్లో చైతన్యం పెరగడం శుభపరిణామమని కలెక్టర్‌ హనుమంతరావు పేర్కొన్నారు.

మూడింట్లో మహిళలు, నాలుగింట్లో పురుషులు..

మున్సిపల్‌ ఓటింగ్‌లో మూడు మున్సిపాలిటీల్లో మహిళా ఓటింగ్‌, నాలుగు మున్సిపాలిటీల్లో పురుషుల ఓటింగ్‌ ఎక్కువగా ఉండడం విశేషం. అయితే హైదరాబాద్‌కు అతి సమీపంలోని తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, బొల్లారంలో మహిళా ఓటింగ్‌ ఎక్కువ నమోదైంది. ఈ ప్రాంతంలో దేశంలోని వివిధ ప్రాం తాలకు చెం దిన కార్మికులు, ఉద్యోగులు నివాసం ఉంటుంటారు. పెద్దఎత్తున పరిశ్రమలు వెలిసిన నేపథ్యంలో అందులో పనిచేయడానికి వస్తుంటారు. అలాంటి వారితోపాటు స్థానిక మహిళలు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికలను మూడు మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీలు సవాల్‌గా కూడా తీసుకున్నాయి. అభ్యర్థులు పోటీ పడి ఓట్లు వేయించుకున్నారు. ఇదిలా ఉండగా, సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్‌, అందోలుజోగిపేట మున్సిపాలిటీల్లో మాత్రం పురుషుల ఓటింగు ఎక్కువ నమోదైంది. అత్యధికంగా నారాయణఖేడ్‌ మున్సిపాలిటీల్లో పురుషుల ఓటింగ్‌ 83.86శాతంగా నమోదైతే మహిళల ఓటింగ్‌కు 71.37 శాతానికి పడిపోవడం అందోళన కలిగిస్తున్నది. ఇక్కడ మాత్రం ఓట్లు వేయడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపనట్లు లెక్కలు చెబుతున్నాయి. మిగతా చోట్ల మాత్రం మహిళలు, పురుషుల ఓటింగ్‌ కొద్ది మాత్రం తేడా ఉన్నది.logo