బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Jan 23, 2020 , 01:20:10

అణుశక్తి రంగంలో మంచి అవకాశాలు

అణుశక్తి రంగంలో మంచి అవకాశాలు
  • - ఎన్ డీజీఎం విశ్వేశ్వరరావుపటాన్ నమస్తే తెలంగాణ: అణుశక్తి రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలున్నాయని హైదరాబాద్ అణు ఇంధన సంస్థ (ఎన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఈపీసీ అండ్ ఈఎం) ఆర్ విశ్వేశ్వరరావు అన్నారు. బుధవారం పటాన్ మండలం రుద్రారం పరిధిలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని ఆయన శాస్త్రవేత్తలు కే. విశ్వప్రసాద్, దివిజ్ భట్టాచార్జీతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గీతం విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆ బృంద సభ్యులు మాట్లాడుతూ, అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోని పలు సంస్థల్లో ఉద్యోగాలకు అభ్యర్థులను సహజంగా గేట్ (గ్రాడ్యుయేట్ అప్టిట్యూట్ టెస్ట్ ఇంజినీరింగ్)లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారిని ఎంపిక చేస్తారని వివరించారు. ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కూడా బాబా అణుశక్తి సంస్థ (బార్క్), ఎన్ ఉద్యోగార్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. 

ఈ విభాగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతో పాటు ఆకర్షణీయమైన జీతం కూడా ఉంటుందని, ఇటు దేశ సేవ చేశామనే సంతృప్తితో పాటు అటు కుటుంబానికి కూడా మంచి తోడ్పాటును అందించవచ్చని పేర్కొన్నారు. అణుశక్తి విభాగంలోని ఉద్యోగాలు కేవలం మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థులకే కాకుండా అన్ని రకాల ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి లభిస్తాయని, అయితే అది మన ప్రతిభ, అభిరుచి, సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయని ఆయన చెప్పారు. అణు ఇంధన వనరులైన యురేనియం వెలికితీత వల్ల పర్యావరణానికి పెద్దఎత్తున ముప్పు వాటిల్లుతుందని భావించడం వాస్తవం కాదన్నారు. అన్ని రకాల పరీక్షలు, నిరంతర పర్యవేక్షణలోనే ఖనిజాలను వెలికితీస్తున్నట్లు విశ్వప్రసాద్ వివరించారు. సంప్రదాయ పరిశ్రమలతో పోల్చుకుంటే అణుశక్తి రంగంలో చాలా తక్కువ వ్యర్థాలే ఉత్పత్తి అవుతాయని ఎన్ బృందం సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ముగ్గురు అతిథులను స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, మెకానికల్-సీఎల్ విభాగాధిపతులు ప్రొఫెసర్ పున్నా ఈశ్వరయ్య, ప్రొఫెసర్ ఎస్ ఫణికుమార్ సత్కరించారు.


logo