ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jan 22, 2020 , 01:18:36

మహిళల భద్రత కోసం షీ టీంలు

మహిళల భద్రత కోసం షీ టీంలు


జహీరాబాద్, నమస్తే తెలంగాణ : మహిళలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం షీ టీంలు ఏర్పాటు చేసి రక్షణ కలిపిస్తున్నది. షీ టీంలను పోలీసుశాఖ హైదరాబాద్ ప్రయోగాత్మకంగా అమలు చేయడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీంలు ఏర్పాటు చేసి మహిళలు, విద్యార్థినులకు రక్షణ కల్పిస్తున్నారు. జహీరాబాద్ షీ టీం డీఎస్పీ గణపత్ జాదవ్ పర్యవేక్షణలో జహీరాబాద్ రూరల్ ఎస్ వినయ్ ఇన్ షానుబాయి షీ టీం సభ్యురాలుగా పని చేస్తున్నారు. వీరు పట్టణంలో ఉన్న కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు ఈవ్ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో నిఘా ఏర్పాటు చేసి ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. షీటీంలు నిర్విరామంగా మహిళల రక్షణ కోసం పనిచేస్తున్నాయి. షీ టీంపై ప్రత్యేక కథనం ఇది.

జహీరాబాద్ షీటీం ప్రత్యేక నిఘా

పట్టణంలో షీ టీం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మహిళలు, విద్యార్థినులకు భద్రత కల్పిస్తున్నారు.  డీఎస్పీ గణపత్ జాదవ్ పర్యవేక్షణలో ఎస్ వినాయ్ షీ టీం సభ్యురాలు షానుబాయిలు జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, జహీరాబాద్ రూరల్, కోహీర్, చెరాగ్ హద్నూర్, ఝరాసంగం, రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కళాశాలలు, పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. షీ టీం సేవలు విస్తరించేందుకు ఎస్పీ చంద్రశేఖర్ కృషిచేస్తున్నారు.  మహిళలకు భద్రత కల్పించడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చట్టాలపై విద్యార్థినులకు అవగాహన

మహిళలపై వేధింపులు, విద్యార్థినులపై ఈవ్ పాల్పడడం వంటి ఫిర్యాదులు షీటీంకు రావడంతో వారు వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారు. మఫ్టీలో ఉంటూ పెన్ కెమెరా ద్వారా ఆకతాయిల ఆగడాలను చిత్రీకరిస్తున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఈవ్ మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జహీరాబాద్ షీటీం సభ్యులు ఈ ఏడాది 46 మందికి కౌన్సెలింగ్ చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. షీ టీం పై అవగాహన కల్పింపించేందుకు 24సదస్సులు నిర్వహించారు. వేధింపులు పాల్పడ్డ ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఆపదలో ఉన్న సమయంలో 100 డయల్ చేయాలని అవగాహన కల్పిస్తున్నారు.

మీ కోసం మేమున్నాం..

మహిళల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. శంషాబాద్ ఘటన నేపథ్యంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఏ సమయంలోనైనా తమ సేవలు పొందువచ్చని భరోసా ఇస్తున్నారు. ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తే వెంటనే తమను సంప్రదించాలని, క్షణాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు.

షీ టీంలతో మహిళలకు రక్షణ

జహీరాబాద్ షీటీం ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. జహీరాబాద్ రూరల్ ఎస్ వినాయ్ ఇన్  షీ టీం సభ్యురాలుగా షానుబాయి పని చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఉన్న పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు షీటీంపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళల రక్షణతో పాటు ఆకతాయిల ఆగడాలను అరికడుతున్నాం.

గణపత్ జాదవ్  డీఎస్పీ జహీరాబాద్

మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం

 పట్టణంలో ఉన్న కళాశాలు, పాఠశాలు, మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. గ్రామా ల్లో కూడా మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. వరకట్న వేధింపులు, లైంగిక దాడులు, ఏమైనా ఉంటే  షీ టీంను సంప్రదించాలని సూచిస్తున్నాం. గతంలో పోల్చుకుంటే షీటీం ఏర్పాటు చేసిన తర్వాత మహిళలపై లైంగిక వేధింపులు, దాడులు తగ్గిపోయాయి. ఆర్టీసీ బస్టాండ్, కళాశాలల వద్ద మఫ్టీలో నిఘా వేస్తున్నాం.
షానుబాయి, షీ టీం సభ్యులురాలు జహీరాబాద్


logo