ఆదివారం 25 అక్టోబర్ 2020
Sangareddy - Jan 21, 2020 , 00:34:46

జగ్గారెడ్డి ..నోరు జాగ్రత్త

 జగ్గారెడ్డి ..నోరు జాగ్రత్త


సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : ఆడలేక మద్దెలవోడు అన్న చందంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరు ఉందని.. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే భయంతో మంత్రి హరీశ్‌రావుపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇది ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని సిద్దిపేట టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి అన్నారు. మంత్రి హరీశ్‌రావు పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం సిద్దిపేటలో జగ్గారెడ్డి దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించి పాత బస్టాండ్‌ వద్ద కౌన్సిలర్లు వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్‌తో కలిసి జగ్గారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని, వెంటనే మంత్రి హరీశ్‌రావుకు క్షమాపణలు చెప్పాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, ధర్మవరం బ్రహ్మం, సాకి ఆనంద్‌, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు ఈర్షద్‌హుస్సేన్‌, నాయిని జైపాల్‌రెడ్డి, చంద్రం, ప్రభాకర్‌ పలువురు నాయకులు పాల్గొన్నారు.

జగ్గారెడ్డిని కఠినంగా శిక్షించాలి

సిద్దిపేట టౌన్‌ : ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కఠినంగా శిక్షించాలని టీఆర్‌ఎస్‌ నాయకుడు రాజేందర్‌ అన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ నాయకులు సిద్దిపేట వన్‌టౌన్‌ పో లీసు స్టేషన్‌లో సీఐ సైదులుకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజేందర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారనే భయంతోనే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజాకోర్టులో జగ్గారెడ్డికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో అరుణ్‌సాయి, నవీన్‌, అనిల్‌, రాజేశ్‌ ఉన్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే పై పోలీసులకు ఫిర్యాదు

కొమురవెల్లి : మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పై అసభ్యకర రీతిలో వ్యా ఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పై కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌లో టీఆర్‌ఎస్వీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీనియర్‌ నాయకుడు ఏర్పుల మహేశ్‌ మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. ఆయనతో పాటు చందు తదితరులున్నారు.logo