మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jan 19, 2020 , 00:08:08

గులాబీ సైన్యానికి అవకాశం ఇవ్వండి

గులాబీ సైన్యానికి అవకాశం ఇవ్వండి


అందోల్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి.. అభివృద్ధి అంటే ఎందో చూపిస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచార సభలను నిర్వహించారు. అందోలులోని డీఎల్‌ ఫంక్షన్‌ హాల్‌, జోగిపేటలోని పబ్బతి హనుమాన్‌ మందిరం వద్ద, వాసవీ కల్యాణ మండపం వద్ద వేర్వురుగా సమావేశాలను ఏర్పా టు చేసి, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో గత పాలకవర్గం కాంగ్రెస్‌, అప్పటి ఎమ్మె ల్యే బాబూమోహన్‌ ఉండడం, వారిద్దరి మధ్య సమన్వయ లోపంతో ఎలాంటి అభివృద్ధి పనులు జరుగలేదన్నారు. అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ‘పల్లెటూరికి ఎక్కువ.. పట్టణానికి తక్కువ’గా జోగిపేట మున్సిపాలిటీ తయారైందన్నారు. ఇండ్లు లేని వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఖాళీ స్థలం ఉన్న వారికి ఇండ్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామన్నారు. పట్టణంలోని ప్రతి వార్డుకు రూ.30 నుంచి రూ.40 లక్షల నిధులను కేటాయిస్తామని చెప్పారు.

అందోలు మినీట్యాంక్‌ బండ్‌ను టూరి జం స్పాట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ సమావేశాలను ప్రజలు రాకుండా కాంగ్రెసోళ్లు పైసలిస్తున్నారని, ఓటుకు నోటు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అలాంటి వారికి ఓట్లేస్తే ఎలాంటి అభివృద్ధి జరుగదన్నారు. ప్రజల కోసం పనిచేసే వాళ్లకే ఓటేయ్యాలని సూచించారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, సౌత్‌ ఇండియా డిక్కీ వైస్‌ చైర్మన్‌ రాహుల్‌ కిరణ్‌, జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు గూడెం మల్ల య్య, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వ సమితి సభ్యుడు లింగాగౌడ్‌, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వర్కల అశోక్‌, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ మాజీ ఇన్‌చార్జి పులుగు కిష్టయ్య, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చాపల వెంకటేశం, మాజీ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు 

మున్సిపల్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన మేనిఫెస్టోను  ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ రూపొందించారు. ఈ మేనిఫెస్టోను మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా, అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపించేందుకు మేనిఫెస్టోను తయారు చేశామన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని ఆయన హామీనిచ్చారు. మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ జెండాను ఎగురవేయాలని, ఇందుకు ప్రజలందరూ పార్టీ అభ్యర్థులను  ఆశీర్వదించాలన్నారు. 

6 నెలలో సింగూర్‌కు కాళేశ్వరం నీళ్లు

సింగూర్‌ ప్రాజెక్టుకు శాశ్వతంగా జలకళను సంతరించుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కాళేశ్వరం నీళ్లు సిరిసిల్ల వరకు వచ్చాయని, రెండు నెలల్లోగా మల్లన్నసాగర్‌ వరకు చేరుకుంటాయని తెలిపారు. మరో అరు మాసాల్లో మల్లన్నసాగర్‌ నుంచి సింగూర్‌కు గోదావరి నీళ్లు రాబోతున్నాయని, సింగూర్‌ ప్రాజెక్టు శాశ్వతంగా జలకళతో ఉంటుందని ఆయన తెలిపారు.logo