శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Jan 19, 2020 , 00:05:38

ఎన్నికల అధికారులు బాధ్యతగా పనిచేయాలి

ఎన్నికల అధికారులు బాధ్యతగా పనిచేయాలి


సంగారెడ్డి చౌరస్తా: మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్‌ హనుమంతరావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియం లో మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు ఒక రోజు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ పర్యవేక్షకులు, అసిస్టెంట్‌ పర్యవేక్షకులు నిష్పక్షపాతం గా పనిచేయాలన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులను కలెక్టర్‌ వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో అన్ని ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేశామని గుర్తుచేశారు. ఈ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరుగాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి ఎన్నికలు కొత్తగా ఉంటాయని అధికారులు మున్సిపాల్‌ ఎన్నికల విధులు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌ సమయంలో అం దరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

బ్యాలెట్‌ పేపర్‌ చూసుకోవాలని, బ్యాలెట్‌ బాక్స్‌ పనిచేస్తున్నదా లేదా చూసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన పుస్తకాన్ని ఒకసారి చదువువాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ముందు రోజు సాయం త్రం వచ్చే వారికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. కౌం టింగ్‌ కేంద్రాలకు విధిగా ఉదయం 5 గంటలకు చేరుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేసిన యెడల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. నిర్దిష్ట సమయం మేరకు కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రణాళిక రూ పొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో నగేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతి, మాస్టర్‌ ట్రైనర్లు కృష్ణ, బసవయ్య, కౌంటింగ్‌ పర్యవేక్షకులు, అసిస్టెంట్‌ పర్యవేక్షకులు పాల్గొన్నారు.


logo