సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jan 14, 2020 , 01:15:27

ఉపసంహరణల జోరు

ఉపసంహరణల జోరు
  • -ఏడు మున్సిపాలిటీల్లో 63 నామినేషన్ల విత్‌డ్రా
  • -పత్రాలను పరిశీలించిన కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి మున్సిపాలిటీ: మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లలో సోమవారం 11 నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. నామినేషన్ల ఉపసంహరణను కలెక్టర్‌ హనుమంతరావు పరిశీలించారు. 23వ వార్డులో రంగమ్మ (స్వతంత్ర), 6 వార్డులో ఇద్దరు పవనగారి శివశంకర్‌ (కాంగ్రెస్‌), మహ్మద్‌గౌస్‌ (స్వతంత్ర), 25వ వార్డు అమ్రీన్‌ పర్వీన్‌ (స్వతంత్ర), 31వ వార్డు బండారి శారద (స్వతంత్ర), 33వ వార్డులో ఇద్దరు ఎర్రోళ్ల మల్లికార్జున్‌ (కాంగ్రెస్‌), సోమ సాయి చంద్‌(స్వతంత్ర), 13వ వార్డు బర్రెంకల చంద్రకళ (కాంగ్రెస్‌), 35వ వార్డు మహ్మద్‌ ఆరిఫ్‌ (స్వతంత్ర), 21వ వార్డు చవాన్‌ మహేందర్‌ (కాంగ్రెస్‌), 22వ వార్డు మహబూబ్‌ (స్వతంత్ర)లు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతి, సిబ్బంది పాల్గొన్నారు.

పేటలో తొమ్మిది మంది..

సదాశివపేట : సదాశివపేట మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 280 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పరిశీలనలో ఒకటి కూడా తిరస్కరణ కాలేదు. కాగా, రెండు రోజులు ఎవరు ఉపసంహరణలు చేయక పోగా, మూడో రోజు సోమవారం తొమ్మిది మంది ఉపసంహరించుకున్నారు. పట్టణంలో మొత్తం 26వార్డులు ఉన్నప్పటికీ 5 వార్డులకు చెందిన తొమ్మిది మంది అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నట్లు రిటర్నింగ్‌ అధికారులకు పత్రాలు సమర్పించారు. వార్డులు, పార్టీల వారీగా 1వ వార్డులో ఇండిపెండెంట్‌ ఒకరు, 13లో టీఆర్‌ఎస్‌ ఒకరు, కాంగ్రెస్‌ ఒకరు, 16లో ఇండిపెండెంట్‌ ఒకరు, 22లో కాంగ్రెస్‌ ఒకరు, 23లో టీఆర్‌ఎస్‌ ఒకరు, కాంగ్రెస్‌ ఇద్దరు మొత్తం తొమ్మిది మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

ఖేడ్‌లో 12 నామినేషన్లు..

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ : నారాయణఖేడ్‌లో సోమవారం 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. ఇందులో భాగంగా 2, 8 వార్డులకు సం బంధించి రెండేసి నామినేషన్లు, 3, 5, 6, 7, 10,11,14,15 వార్డులకు సంబంధించిన ఒక్కో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఆదివారం వరకు మొత్తం 132 నామినేషన్లు ఉండగా, 12 నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉంటే మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్నది.

అందోలు-జోగిపేటలో ఇద్దరు..

అందోల్‌, నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. అందోలు-జోగిపేట మున్సిపాలిటీలోని 20 వార్డులకు గాను 115 మంది అభ్యర్థులు, 182 నామినేషన్లను దాఖలు చేశారు. సోమవారం జోగిపేటలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు.  పట్టణంలోని 16వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ అభ్యర్థి పి.స్వరూప, 17వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అరిగె దీక్షిత్‌ తమ నామినేషన్లను విత్‌ డ్రా చేసుకున్నట్లు అసిస్టెంట్‌ జిల్లా ఎన్నికల అధికారి మిర్జా ఫసహాత్‌ అలీబేగ్‌ తెలిపారు.

అమీన్‌పూర్‌లో మరో 10మంది 

అమీన్‌పూర్‌: మున్సిపల్‌ ఎన్నికలలో భాగంగా వేసిన నామినేషన్లలలో సోమవారం 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కమిషనర్‌ వేమనరెడ్డి పేర్కొన్నారు. రెండు రోజులపాటు మొత్తం 12 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. 3వ వార్డులో పట్లోళ్ల మేఘమాల, 5వ వార్డులో శివశంకర్‌, 9వ వార్డులో అదెల్లి రవీందర్‌, 11వ వార్డులో లక్ష్మి రంగినేని, 12వ వార్డులో రంగ కృష్ణవేణి, రాజేశ్వర్‌, ఎం.సురేశ్‌కుమార్‌,13వ వార్డులో నందారం లలిత, 16వ వార్డులో ఎం. సురేశ్‌కుమార్‌, 23వ వార్డులో మ్యాకం మల్లేశ్‌ విత్‌డ్రా చేసుకున్నారు. కాగా, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన మొత్తం 17 బీ ఫాంలు అందజేసినట్లు కమినషర్‌ పేర్కొన్నారు.
తెల్లాపూర్‌లో ఇద్దరు.

రామచంద్రాపురం: అభ్యర్థులకు మంగళవారంతో విత్‌డ్రాల గడువు పూర్తవుతుందని ము న్సిపల్‌ కమిషనర్‌ సంగారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ ము న్సిపాలిటీ పరిధిలోని 17 వార్డులకు గాను 134 నామినేషన్లు వచ్చాయని, ఇప్పటివరకు రెండు నామినేషన్లను అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపారు.  వార్డు నుంచి అనంతగిరిపల్లి ప్రమోదిని, 10వ వార్డు నుంచి ఎన్‌. భుజంగరెడ్డి నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారని చెప్పారు. అభ్యర్థులు  మంగళవారం మ ధ్యా హ్నం 3గంటల లోపు మున్సిపాల్‌ కార్యాలయానికి వచ్చి విత్‌డ్రా చేసుకోవాలని సూచించారు.

బొల్లారంలో 17 నామినేషన్లు

బొల్లారం: నామినేషన్‌ ఉపసంహరించుకున్న అభ్యర్థుల జాబితాను మున్సిపల్‌ అదనపు ఎన్నికల అధికారి సంతోశ్‌కుమార్‌ సోమవారం వెల్లడించారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో 17మంది అభ్యర్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు. 3వ వార్డు తూపల్లి తిరుపతిరెడ్డి(టీఆర్‌ఎస్‌), 6వ వార్డు శంకుతల(టీఆర్‌ఎస్‌), 7వ వార్డులో చక్రపాణి(టీఆర్‌ఎస్‌), జిన్నారం సురేశ్‌(ఇండిపెండెంట్‌), 8వ వార్డులో జిన్నారం అనిత (కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌), 11వ వార్డులో  తలారి రాణి(ఇండిపెండెంట్‌), 12వ వార్డు సుజాత(బీజేపీ), 15వ వార్డు రాధ(టీఆర్‌ఎస్‌), 16వ వార్డులో మహేందర్‌రెడ్డి(ఇండిపెండెంట్‌), బాలరాజు(కాంగ్రెస్‌), 18వ వార్డు వీరయ్య(టీఆర్‌ఎస్‌), 19వ వారుల్డో ఉస్కేబావి నిహారికరెడ్డి(టీఆర్‌ఎస్‌), మమత(టీఆర్‌ఎస్‌), 20వ వార్డు మణిమాల(టీఆర్‌ఎస్‌) నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో ఉన్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ సంతోశ్‌కుమార్‌ పేర్కొన్నారు.logo