బుధవారం 03 జూన్ 2020
Sangareddy - Jan 12, 2020 , 04:54:16

అన్నివార్డులను కైవసం చేసుకోవాలి

అన్నివార్డులను కైవసం చేసుకోవాలి

అందోలు-జోగిపేట మున్సిపాలిటీలోని వార్డులన్నింటినీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుచుకోవాలని, ప్రజల ముందుకు ప్రణాళిక బద్ధంగా వెళ్లాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌కు సూచించారు.

  • పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి
  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌
  • తెలంగాణ భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికలపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో సమీక్ష

అందోల్‌, నమస్తే తెలంగాణ: అందోలు-జోగిపేట మున్సిపాలిటీలోని  వార్డులన్నింటినీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు  గెలుచుకోవాలని, ప్రజల ముందుకు ప్రణాళిక బద్ధంగా వెళ్లాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌కు సూచించారు. శనివారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండేవారిని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే వాళ్లను అభ్యర్థులుగా నిర్ణయించాలన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిలో కొందరికి అవకాశాలు రాలేదని, నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఇందుకు నేను భరోసానిస్తున్నాని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ అందోలు-జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.14 కోట్లను కేటాయించామని, ఈ నిధులతో పనులు కూడా చేపడుతున్నట్లు మంత్రికి వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి కూడా ఉన్నారు. logo