శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Jan 12, 2020 , 00:56:02

అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

సంగారెడ్డి నెట్‌వర్క్‌: మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, శనివారం అధికారులు నామినేషన్లను పరిశీలించారు. అత్యధికంగా 445 నామినేషన్లు వచ్చిన సంగారెడ్డి మున్సిపాలిటీలో ఏ ఒక్క నామినేషన్‌ రిజెక్టు కాలేదు. కాగా, 25వ వార్డుకు సంబంధించిన ఎంఐఎం అభ్యర్థి అమ్రిన్‌ భేగం ఉపసంహరణ చేసుకున్నారు. కాగా, దాఖలైన నామినేషన్లను మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతి, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పరిశీలించారు. అదేవిధంగా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 236 నామినేషన్లు రాగా, అధికారులు వాటిని పరిశీలించి సరైన ప త్రాలు లేని 2 నామినేషన్లను తిరస్కరించామని మున్సిపల్‌ కమిషనర్‌ వేమనరెడ్డి తెలిపారు. నామినేషన్ల తిరస్కరణకు గురైన అభ్యర్థు లు ఆదివారం అప్పీల్‌కు వెళ్లవచ్చని ఆయన సూచించారు. మిగిలిన నారాయణఖేడ్‌, బొల్లారం, అందోల్‌-జోగిపేట, తెల్లాపూర్‌, సదాశివపేట మున్సిపాలిటీల్లో ఏ ఒక్క నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురి కాలేదని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. కాగా, అం దోలు-జోగిపేట మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ నెహ్రూ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని జడ్పీ సీఈవో రవి పరిశీలించారు. కళాశాలలోని డిస్టిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలన చేశారు. కౌంటింగ్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.


logo