బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jan 12, 2020 , 00:55:27

శభాశ్‌ నారాయణ గౌడ్‌..

శభాశ్‌ నారాయణ గౌడ్‌..

పల్లె ప్రగతి మొదటి, రెండో విడుతలో నాగులపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంపై కలెక్టర్‌ హనుమంతరావు గ్రామ సర్పంచ్‌ నారాయణగౌడ్‌ను అభినందించారు. శనివారం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా గ్రామంలో చేపట్టిన పనులను చూసి కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేయడం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు పనులు చివరిదశలో ఉండటంతోపాటు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటి వాటి సంరక్షణకు కృషి చేయడంతో కలెక్టర్‌ సర్పంచ్‌ నారాయణగౌడ్‌తోపాటు ఆయన కొడుకు రాజేశ్వర్‌గౌడ్‌ను శాలువాతో సన్మానించారు. ప్రతి గ్రామాన్ని నాగులపల్లిలా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. పనులు బాగా చేసే ప్రతిఒక్కరినీ సన్మానిస్తామని, అలాగే పనుల్లో నిర్లక్ష్యం వహించేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్‌ చెప్పారు. అభివృద్ధి పనులను పరిశీలించేందుకు గ్రామాలకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాలు వస్తాయని, సరిగా పనులు చేపట్టకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. అనంతరం మొదటిసారిగా మండలానికి వచ్చిన కలెక్టర్‌ను ఎంపీపీ కృష్ణవేణి, జడ్పీటీసీ అపర్ణ, సర్పంచ్‌ నారాయణగౌడ్‌ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రేమలత, ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, ఎంపీవో యూసుఫ్‌ పాల్గొన్నారు. 


logo