గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Jan 12, 2020 , 00:54:08

పాఠశాలలకు సంక్రాంతి శోభ

పాఠశాలలకు సంక్రాంతి శోభ

సంగారెడ్డి చౌరస్తా: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం సంగారెడ్డిలోని వివిధ పాఠశాలల్లో వేడుకలు చేశారు. స్థానిక పయనీర్స్‌ స్కూల్‌తో పాటు శాంతినగర్‌ సేయింట్‌ ఆంథోనీస్‌ హై స్కూల్‌, గణేశ్‌ నగర్‌లోని సేయింట్‌ పీటర్స్‌ స్కూల్‌, సబితా దివ్యాంగుల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పయనీర్స్‌ పాఠశాలలో బాలికలకు ముగ్గులు, బాలురకు పతంగుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వ హించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ సీహెచ్‌ రాజారావు, ప్రిన్సిపాల్‌ రవికాంత్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సేయింట్‌ ఆంథోనీస్‌ పాఠశాల, సేయింట్‌ పీటర్స్‌ స్కూల్‌, సబితా దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు.

ఎంఎన్‌ఆర్‌లో... 

సంగారెడ్డి రూరల్‌: మండలంలోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ముగ్గులు, గాలిపటాల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగజ్యోతి విద్యార్థులకు సంక్రాంతి పండుగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వర్‌, ఇన్‌చార్జి శ్రీదేవి ఉపాధ్యాయులు అరుణ, దుర్గదేవి, కల్యాణి, పద్మప్రి య, పాఠశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo