బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jan 12, 2020 , 00:52:32

కొనసాగుతున్న పల్లె ప్రగతి

కొనసాగుతున్న పల్లె ప్రగతి


సంగారెడ్డి రూరల్‌: ప్రతి పల్లె అభివృద్ధిలో పురోగతి సాధించాలంటే పల్లె ప్రగతి కార్యక్రమంలో యువత, గ్రామస్తులు ముందడుగు వేయాలని డీఆర్డీవో అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం మండలంలోని తాళపల్లి, కల్పగూర్‌, ఇరిగేపల్లిలో పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. పనులను వేగవంతం చేయాలని సర్పంచ్‌లు, అధికారులకు సూచించారు. తాళపల్లిలో జరుగుతున్న పనులను చూసి సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్‌కు అభినందించారు. అనంతరం మండల పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలను నాటి ట్రీగార్డు ఏర్పాటు చేసి నీళ్లు పోశారు.

యువత సమీక్ష సమావేశం..

కల్పగూర్‌ గ్రామంలో పల్లె ప్రగతిపై యువకులను గ్రామ పంచాయతీలో ఎంపీపీ లావణ్య ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఆదివారం యువకులు, ప్రతి శుక్రవారం మహిళలు శ్రమదానంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అమర్‌నాథ్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ అజయ్‌కుమార్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, ఏపీవో లింగమణి, పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, ముద్దుకృష్ణ, పాఠశాల చైర్మన్‌ శ్రీనివాస్‌, నాయకులు సాగర్‌, అనిల్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.


logo