బుధవారం 03 జూన్ 2020
Sangareddy - Jan 12, 2020 , 00:50:21

పండుగే...పండుగ

పండుగే...పండుగ
  • -నేటి నుంచి సంక్రాంతి సెలవులు
  • -ఈ నెల 17న విద్యాసంస్థల పునఃప్రారంభం
  • -సొంతూళ్లకు బయల్దేరిన విద్యార్థులు

సంగారెడ్డి చౌరస్తా : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి పండగ సెలవు లు రానే వచ్చాయి. నేటి నుంచి 16 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సె లవులు ప్రకటించారు. దీంతో ఎప్పుడూ పు స్తకాలతో బిజీ బిజీగా ఉండే విద్యార్థులకు ఆ ట విడుపు దొరకడంతో వారి సంతోషం అ వదులు దాటింది. సంక్రాంతి పండగ సెలవులు వచ్చాయని, తమ నానమ్మ, అమ్మ మ్మ ఇళ్లకు వెళ్తున్నామనే చిన్నారుల మాట లు చివరి రోజు పాఠశాల ఆవరణలో సంద డి చేశాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం తో శనివారం సాయంత్రానికే అన్ని వసతి గృహాలు కూడా దాదాపుగా ఖాళీ అయ్యా యి. తమ బట్టల బ్యాగులతో సొంతూళ్లకు పయనమయ్యారు.

తిరిగి ఈ నెల 17న వి ద్యా సంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. తొలుత ఈ నెల 11 నుంచి 16 వరకు పాఠశాలలకు సెలవులు అని ప్రకటించినప్పటికీ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ రెండో శనివారం కూడా విద్యా సంస్థలను నిర్వహించాలని సూచించడంతో అన్ని పాఠశాలలు యథావిధిగా కొనసాగాయి. అయితే ఈ నెల 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించగా, 12న ఆదివారం సాధారణ సెలవు కలిసి రావడంతో మొత్తం 5 రోజుల వరుస సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్వగ్రామాలకు..

హత్నూర : సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో విద్యార్థులు వారివారి సొంత గ్రామాలకు శనివారం వెళ్లిపోయారు. హ త్నూరలోని గురుకుల పాఠశాల, కళాశాల, బీసీ బాలుర వసతిగృహం, ఎస్టీ బాలికల వ సతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు సం క్రాంతి సెలవులకు శనివారం వారి గ్రామాలకు వెళ్లారు. తల్లిదండ్రులు వసతి గృహాలకు చేరుకొని పిల్లలను వెంట తీసుకెళ్లారు. 


logo