e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జిల్లాలు సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలి

సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలి

జహీరాబాద్‌ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
జహీరాబాద్‌, జూలై 31 :ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు కృషి చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు కోరారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిపించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని, ప్రణాళిక ప్రకారం పనులు చేసి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే అన్నారు. శనివారం మొగుడంపల్లి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ప్రియాంక అధ్యక్షతన నిర్వహించారు. మొగుడంపల్లి కొత్త మండలంగా ఏర్పాటు చేసేందుకు ఎంపీ బీబీ పాటిల్‌, మాజీ ఎమ్మెల్సీ ఫరీదొద్దీన్‌, తాను ఎంతో కృషి చేశామని గుర్తు చేశారు. కొత్త మండలంలో తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయ భవనాలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సానుకులంగా స్పందించారన్నారు. గ్రామాల్లో విద్యుత్తు సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతిలో నిధులు మంజూరు చేసిందన్నారు.

ప్రతి గ్రామం విద్యుత్తు దీపాలు పగలు వెలుగకుండా ఆన్‌ ఆఫ్‌ స్వీచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సర్పంచులకు ఎమ్మెల్యే సూచించారు. పర్వాతపూర్‌, గోవింద్‌పూర్‌ విద్యుత్తు సబ్‌స్టేషన్‌ పనులు ఆగస్టు మొదటి వారం వరకు పూర్తి చేయాలని, రెండో వారంలో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని ట్రాన్స్‌కో ఏఈకి సూచించారు. ధనసిరి విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, ప్రధాన లైన్‌ పనులు పూర్తి చేయాలన్నారు. మిషన్‌ భగీరథ తాగునీరు ప్రతి గ్రామానికి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధనసిరి గ్రామానికి మిషన్‌ భగరీథ నీరు రావడం లేదని సర్పంచు హెచ్‌, రాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. అసంద్‌గంజ్‌, గోపన్‌పల్లి గ్రామాలకు సైతం మిషన్‌ భగీరథ నీరు రావడం లేదని సర్పంచ్‌ ఓంకార్‌, ఎంపీటీసీ రాంచందర్‌ తెలిపారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు కల్పించుకుని వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఏఈ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. మొగుడంపల్లి నుంచి విట్టునాయక్‌తండాకు కొత్తగా రోడ్డు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఎందుకు పను లు ప్రారంభించ లేదని ఎమ్మెల్యే ఏఈ కోటేశ్వర్‌రావును ప్రశ్నించారు. ఏఈ కల్పించుకొని కాంట్రాక్టరుకు అప్పగించిన పనులు ప్రారంభించడం లేదనగా, కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గుడ్‌పల్లి, ఔరంగనగర్‌ గ్రామంలో కొంత మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వలేదన్నారు. సమావేశంలో జడ్పీటీసీ అరుణరెడ్డి, తహసీల్దార్‌ ప్రేంకుమార్‌, ఎంపీడీవో మహేశ్‌, సర్పంచులు ఈశ్వర్‌రెడ్డి, సురేశ్‌, రాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana