e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home సంగారెడ్డి అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
  • అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
  • అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పని చేయాలి
  • మండల అభివృద్ధే లక్ష్యం, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి
  • పెండింగ్‌ పనులు, పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలి
  • పలు శాఖల పనితీరుపై సమీక్షించిన హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌ కుమార్‌

అక్కన్నపేట, జూన్‌ 17 : అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం, అలస్వతం తగదు అని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మండల అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ పలు శాఖల మండల, డివిజన్‌ స్థాయి అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పలు శాఖల పనితీరుపై ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా ప్రగతిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మండల అభివృద్ధే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం గా పని చేయాలన్నారు. అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.

శాఖల వారీగా జరిగిన సమీక్ష అంశాలను ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి మండల వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను వందశాతం సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మండలానికి కేటాయించిన నిధులు విడుదలలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ప్రత్యేక నిధుల ప్యాకేజీని మండలానికి కేటాయించే విధంగా జిల్లాస్థాయి సమీక్షల్లో అధికారులు కృషి చేయాలన్నారు. మండల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఒకటి, రెండు శాఖల మినహా మిగతా శాఖల పనితీరుపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, ఎంపీడీవో సత్యపాల్‌రెడ్డి, గ్రిడ్‌ జిల్లా ఈఈ చల్మారెడ్డి, డీఈ బాలరాజు, పీఆర్‌ డీఈ సదాశివరెడ్డి, వ్యవసాయశాఖ ఏడీఏ మహేశ్‌, విద్యుత్‌ ఏడీఈ దుర్గ శ్రీనివాస్‌, పలు శాఖల మండల బాధ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు

ట్రెండింగ్‌

Advertisement